Special drive | మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు

Special drive | మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు
- ఎస్ఐ జి మహేష్
Special drive | ధర్మపురి, ఆంధ్రప్రభ : మైనర్లు వాహనాలు నడుపుతూ రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని ధర్మపురి ఎస్సై లు గురక మహేష్, మిర్యాల రవీందర్ లు హెచ్చరించారు. ఈ రోజు ధర్మపురి పట్టణంలో వాహనాల తనిఖీ స్పెషల్ డ్రైవ్(Special drive)లో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు.
వాహన ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలకు జరిమాన విధించారు. ప్రతి ఒక్కరు వాహనానికి నెంబర్ ప్లేట్(number plate) కలిగి ఉండాలని వాహనానికి సంబంధించిన పెండింగ్ చలాన్ లు ఉండకుండా చాలన్ లను చెల్లించుకోవాలని సూచించారు. వాహన రిజిస్ట్రేషన్ తో పాటు ఇన్సూరెన్స్ తదితర పత్రాలను కలిగి ఉండాలని ట్రిపుల్ రైడ్స్ చేయరాదని తెలిపారు కానిస్టేబుళ్లు సిబ్బంది తదితరులు ఉన్నారు.

