Revenue Officers | దళిత, గిరిజన భూములను ప్రభుత్వం పరిరక్షించాలి

Revenue Officers | దళిత, గిరిజన భూములను ప్రభుత్వం పరిరక్షించాలి
- బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్
Revenue Officers | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి జిల్లా అయిన నాగర్ కర్నూల్ జిల్లాలోని ఉరుకొండ పేట మండలంలో దళిత గిరిజన భూములను ఆ మండల రెవెన్యూ తాసిల్దార్ యూసుఫ్ అలీ రియల్ మాఫియాతో కుమ్మక్కై రియాల్టర్లకు పట్టా చేస్తున్నాడని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ ఆరోపించారు.
ఈ రోజు సాయంత్రం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లక్ష్మణ్ మాటాడుతూ… రెవెన్యూ అధికారుల ఆగడాలు ఆకృత్యాలు రియల్ మాఫియా కుమ్మక్కు దళిత గిరిజనుల భూములను రియల్టార్లకు పట్టాలు చేయడంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఊరుకొండ లోని 168సర్వే నెంబర్లు 4 ఎకరాలు 10 కుంటలు భూమిని 1977లో గిరిజనులకు కేటాయించగా ఆ భూమిని శ్రీకాంత్ నాగయ్య మహబూబద్ అనే రియల్ వ్యాపారులకు ఆ మండలం తాసిల్దార్ యూసుఫ్ అలీ పట్టాలు ఇచ్చాడని వారికి సేల్ డీడ్ చేశాడని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్‌కు ఈ రోజు సాయంత్రం లిఖితపూర్వకంగా కలెక్టర్ కార్యాలయంలో కలిసి ఫిర్యాదు చేశార. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేందర్ గౌడ్, కార్యదర్శి చంద్రకళ, ఆఫీస్ సెక్రటరీ చందు పాల్గొన్నారు.
