Savitribai Phule | ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం

Savitribai Phule | హిందూపురం టౌన్, ఆంధ్రప్రభ : మహిళల చదువుల తల్లి సావిత్రి బాయి పూలే జ‌యంతి సంద‌ర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని హిందూపురం పట్టణంలోని ఓరియంటల్ మున్సిపల్ హైస్కూల్ ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సందర్భంగా బాల్య వివాహాలు, వితంతు పునర్ వివాహాలు, సతీసహగమనంపై సావిత్రిబాయి చేసిన పోరాటాన్ని కొనియాడారు. ఈ సంద‌ర్భంగా పాఠశాలలో మహిళా ఉపాధ్యాయునులకు పుష్పగుచ్‌చాలు అంద‌జేసి శాలువాల‌తో సన్మానించారు. కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు పెన్నోబులం , సీనియర్ ఉపాధ్యాయులు సిద్ధగిరి శ్రీనివాస్, రామాంజనేయులు, రమేష్ రెడ్డి, నాగప్ప, క్రిష్టప్ప, నరేష్, బాలకృష్ణ, సతీష్ పాల్గొన్నారు.

Leave a Reply