Rammohan Naidu | అంబేద్కర్ అందరికీ మార్గదర్శి
Rammohan Naidu | అంబేద్కర్ అందరికీ మార్గదర్శి
- కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే కూన రవికుమార్
Rammohan Naidu | సరుబుజ్జిలి(శ్రీకాకుళం), ఆంధ్రప్రభ : బాబా సాహెబ్ అంబేద్కర్ దేశానికి అందించిన రాజ్యాంగం ప్రతి పౌరునికి సమాన హక్కులు, స్వేచ్ఛను కల్పించిందని, ఆయన ఆలోచనలు నేటి తరానికి నిరంతర మార్గదర్శకాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శనివారం ఆముదాలవలస నియోజకవర్గం, సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం పంచాయతీ పరిధిలోని పఖీర్ సాహెబ్ పేట గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. రాష్ట్ర పీయూసీ ఛైర్మన్, ఎమ్మెల్యే (Mla) కూన రవికుమార్‌తో కలిసి కేంద్ర మంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ.. సామాజిక న్యాయం, సమానత్వం, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ (Ambedkar) చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. కేవలం విగ్రహాలు ఏర్పాటు చేయడమే కాకుండా, ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడమే మనం ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
