Kurnool | సావిత్రిబాయి ఫూలేకు నివాళులు

Kurnool | సావిత్రిబాయి ఫూలేకు నివాళులు
Kurnool | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : భారతదేశంలో బాలికల కోసం మొట్టమొదటి పాఠశాల ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించి, బాలికలకు, సమాజంలోని బహిష్కృత వర్గాలకు విద్యను అందించిన సావిత్రిబాయి ఫూలే జన్మదినాన్ని పురస్కరించుకుని కర్నూలు నగరంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పూలేకు నివాళులర్పించారు.
ఈసందర్భంగా కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గుడిశ కృష్ణమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి పూల నాగరాజు యాదవ్, డీసీఎంఎస్ చైర్మన్ వై.నాగేశ్వర రావు యాదవ్, రాష్ట్ర నాయిబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ విజయ కుమార్, రాష్ట్ర ఉప్పర కార్పొరేషన్ డైరెక్టర్ ఎల్.వి. ప్రసాద్, సత్రం రామకృష్ణుడు, కాసన మహేష్ గౌడ్, పి.హనుమంతరావు చౌదరి, బేతం కృష్ణుడు, రాంబాబు తదితరులు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బిర్ల కాంపౌండ్ సమీపంలో ఉన్న జ్యోతీరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం గుడిశ కృష్ణమ్మ మాట్లాడుతూ… సావిత్రిబాయి ఫూలే విద్య ద్వారా సామాజిక మార్పునకు నాంది పలికారని, బాలికల విద్యకు ఆమె చేసిన కృషి నేటికీ ఆదర్శప్రాయమన్నారు. సమానత్వం, విద్య, చైతన్యం అనే విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లిన మహనీయుల బాటలో యువత నడవాలని పిలుపునిచ్చారు.
