పోలీసులు మెరుపు దాడి

పోలీసులు మెరుపు దాడి

14 మంది జూదరులు  అరెస్టు..

రూ.20,900లు స్వాధీనం

( గూడూరు – , ఆంధ్రప్రభ)

కృష్ణా జిల్లా గూడూరు మండలం పరిధిలో శుక్రవారం పోలీసులు అకస్మిక దాడి జరిపారు.  సూరదాయిపేట గ్రామంలో కోత ముక్క పేకాట ఆడుచున్న ముగ్గురు జూదరులను  పట్టుకున్నారు. నిందితుల నుంచి  రూ. 8,500 లు – నగదును స్వాధీనం చేసుకున్నారు.

 రాయవరం గ్రామంలో  పదకొండు (11) మంది జూదరులను  పట్టుకుని  రూ. 12,400/- నగదును స్వాధీనం చేసుకున్నారు.  పేకాట, కోడి పందేలు  ఇతర జూద కలాపాలను నిర్వహించినా, పాల్గొన్నా వారిపై చట్టపరమైన కఠిన చర్యలు  తీసుకొంటామని గూడూరు ఎస్​ఐ హెచ్చరించారు.  శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులకు సహకరించాలని ప్రజలను  కోరారు.