Young Man | ల్యాబ్ టెక్నీషియన్ సూసైడ్

Young Man | ల్యాబ్ టెక్నీషియన్ సూసైడ్
Young Man | నిజామాబాద్ క్రైమ్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ నగర ఖలీల్ వాడిలో సాయి అశ్విని హాస్పిటల్ లో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న ఓంకార్ (27) యువకుడు బాత్రూంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తెల్లవారుజామున చోటుచేసుకుంది. గత ఆరు సంవత్సరాలుగా ఇదే ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. ఓంకార్ స్వస్థలం ధర్మాబాద్ గా పోలీసులు గుర్తించారు.

రోజువారి లాగే విధులకు వచ్చిన ఓంకార్ ఇవాళ తెల్లవారుజామున బాత్రూంలో ఆత్మహత్య చేసుకోగా. ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు ఓంకార్ మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారి ఫిర్యాదుతో విచారణ చేపడుతున్నారు. ఆస్పత్రి బాత్రూంలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న ఓంకార్ బలవన్మరణానికి పాల్పడడం ఖలీల్ వాడిలో కలకలం రేపింది.

