Energetic hero | వాళ్లిద్దరూ చేస్తున్నారా..?

Energetic hero | వాళ్లిద్దరూ చేస్తున్నారా..?

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఇండస్ట్రీలో ఒకరి కోసం కథ రాస్తే.. మరో హీరోతో సెట్(Set with another hero) అవ్వడం జరుగుతుంటుంది. అందుకనే.. ఏ కథ అయినా ఎవరికి రాసి పెట్టి ఉంటే.. వాళ్ల దగ్గరికే వెళుతుంటుంది అంటుంటారు. ఇప్పుడు ఎనర్జిటిక్ హీరో రామ్ కోసం కథలు రాస్తే.. వేరే హీరోల దగ్గరకు వెళ్లిందని తెలిసింది. రామ్ నో చెప్పిన రెండు కథలను.. ఇద్దరు హీరోలు ఓకే చేశారని.. ఇప్పుడు ఆ రెండు సినిమాలు షూటింగ్(Those two films are shooting) జరుపుకుంటున్నాయని.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయని అనేది ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇంతకీ.. ఆ ఇద్దరు హీరోలు ఎవరు..? ఆ సినిమాలు ఏంటి..?

Energetic hero | చైతూ వృషకర్మ..

Energetic hero

రామ్ కోసం.. కార్తీక్ దండు మిస్టిక్ థ్రిల్లర్ కథ రెడీ చేశాడట. విరూపాక్ష బ్లాక్ బస్టర్ సక్సెస్(Virupaksha blockbuster success) తర్వాత రామ్ కి కార్తీక్ దండు కథ చెబితే.. తనకు సెట్ అవ్వదు అనుకున్నాడో ఏమో కానీ.. నో చెప్పాడట. దీంతో ఈ కథ నాగచైతన్య దగ్గరకు వచ్చిందట. నాగచైతన్య(Naga Chaitanya)కు ఈ కథ చెప్పగానే.. చాలా బాగుంది చేస్తానని ఓకే చెప్పడంతో ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. అదే.. వృషకర్మ. ఈ సినిమాని సీనియర్ ప్రొడ్యూసర్ బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. దాదాపు 100 కోట్లకు పైగా భారీ బడ్జెట్(Big budget) తో ఈ సినిమా రూపొందుతోంది. సమ్మర్ లో ఈ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Energetic hero | అఖిల్ లెనిన్..

Energetic hero

ఇక రామ్ నో చెప్పిన మరో కథ లెనిన్. ఈ కథను డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరు(Director Murali Kishore Abbur) ముందుగా రామ్ కు చెప్పారట. ఈ కథ రంగస్థలం తరహాలో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందట. గ్రామీణ నేపథ్యంలో ఉండే ఈ కథ తనకు సెట్ కాదు అనుకున్నాడో ఏమో కానీ.. సున్నితంగా నో చెప్పాడట. అప్పుడు ఈ కథను అక్కినేని అఖిల్(Akkineni Akhil) కు చెబితే వెంటనే ఎస్ చెప్పాడట. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను ఈ నెల 5న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఏజెంట్ సినిమా డిజాస్టర్ అవ్వడంతో చాలా కథలు విని ఈ కథను ఓకే చేశాడు అఖిల్. మార్చిలో లెనిన్ థియేటర్స్(Lenin Theatres) లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ విధంగా రామ్ నో చెప్పిన కథలు.. అక్కినేని బ్రదర్స్.. నాగచైతన్య, అఖిల్ దగ్గరకు వచ్చాయి. మరి.. ఈ రెండు సినిమాలతో అక్కినేని బ్రదర్స్ ఎంత వరకు మెప్పిస్తారో.. ఏ రేంజ్ సక్సెస్(Range Success) సాధిస్తారో చూడాలి.

Energetic hero

CLICK HERE TO READ రష్మిక పెళ్లి తర్వాత నటించదా..?

CLICK HERE TO READ MORE

Leave a Reply