Illegal | సత్ప్రవర్తనతో మెలిగితే రౌడీ షీట్స్ ఎత్తేస్తాం..

Illegal | సత్ప్రవర్తనతో మెలిగితే రౌడీ షీట్స్ ఎత్తేస్తాం..

  • మున్ముందు కూడ రౌడీషీట్స్ తొలగిస్తాం
  • చట్ట వ్యతిరేక చర్యలను సహించం
  • మంచి జీవితం గడిపే వారికి అండగా నిలుస్తాం
  • రౌడీ షీటర్ల కదలికలపై కన్నేస్తాం
  • వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ ప్రత్‌ సింగ్‌

Illegal | వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ : ఎలాంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడకుండా సత్ప్రవర్తనతో జీవితం కోనసాగిస్తే రౌడీ షీట్‌(Rowdy sheet) నుండి పేర్లను తోలగిస్తామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్ ప్రీత్ సింగ్ ప్రకటించారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే చట్ట ప్రకారం నడుచుకొంటామని తెగేసి చెప్పారు. ప్రజలంతా ప్రశాంత జీవితం గడిపే పరిస్థితులను కల్పించడమే పోలీసుల లక్ష్యం, బాధ్యత అని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు.

నూతన సంవత్సరం వేళ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పరివర్తన కార్యక్రమం నిర్వహించారు. వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలోని రౌడీ షీటర్లతో పాటు కేడీలు, అనుమానితులపై ఉన్న షీట్లను తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వు పత్రాలను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్ ప్రీత్ సింగ్ చేతుల మీదుగా రౌడీ షీటర్లతో పాటు కేడీలు, అనుమానితులకు అందజేశారు. వరంగల్‌ కమిషనరేట్‌(Commissionerate) పరిధిలో వివిధ పోలీస్‌ స్టేషన్లలో రౌడీషీటర్లతో పాటు, కేడీలు, అనుమానితుల సుదీర్ఘ కాలంగా జాబితాలో వున్న పేర్లపై వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ప్రత్యేక దృష్టి సారించారు.

ఇందులో భాగంగా వృద్ధాప్యంతో పాటు, సత్‌ ప్రవర్తనతో జీవితాలను గడుపుతున్నట్లుగా ఉన్నతాధికారులు సమీక్షించి రౌడీ షీట్స్ తొలగించాలని సిఫార్సు చేశారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో గుర్తించబడిన 19మందిలో ఐదుగురు రౌడీ షీటర్లు, 12మంది అనుమానితులు, ఒక కెడీ, మరో డిసిని సంబంధిత పోలీస్‌ షీట్ల పేర్లను తొలగిస్తూ వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఉత్తర్వులు అందజేశారు. ప్రస్తుతం ఎలాంటి జీవితాన్ని గడుపుతున్నారని పోలీస్‌ కమిషనర్‌ సన్ ప్రీత్ సింగ్ నేరుగా రౌడీ షీటర్లను అడిగి తెలుసుకున్నారు. ఏ పరిస్థితుల్లో రౌడీయిజానికి పాల్పడ్డా, ఇక నుండైనా కుటుంబ సభ్యుల కోసమైనా ప్రశాంత జీవనం గడపాలని సూచించారు.

గీత దాటినా… హద్దు మీరినా చూస్తూ ఊరుకోబోమని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ వార్నింగ్ ఇచ్చారు. రౌడీ షీట్స్ ఎత్తేశారని ఇక ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తామంటే కుదరదని తెగేసి చెప్పారు. ఇక నుండి నిరంతరం నిఘా ఉంటుందని పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు. చట్టవ్యతిరేక(illegal) చర్యలకు పాల్పడటం కారణంగానే మీపై పోలీస్‌ స్టేషన్లలో రౌడీషీట్లను తెరవడం జరిగిందన్నారు. ప్రస్తుతం మీ ప్రవర్తన బాగుందని విచారించిన అనంతరం మీపై ఉన్న రౌడీ షీట్లను తోలగించడం జరిగిందన్నారు.

Illegal |
Illegal |

ఇదే రీతిలో భవిష్యత్తులో ఎలాంటి సంఘ వ్యతిరేక, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడకుండా మీ వృత్తులను కొనసాగిస్తూ ప్రశాంత జీవితాన్ని గడుపుతారనే నమ్మకంతోనే రౌడీషీట్స్ తొలగించామని పేర్కొన్నారు. అలాగే భవిష్యత్తు(future)లో ఇదే రీతిలో మున్ముందు సత్ప్రవర్తనతో మెలిగే రౌడీషీటర్ల పై ఉన్న షీట్లను తొలగిస్తామని పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వెస్ట్‌జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్‌, అదనపు డీసీపీ రవి, ఏసీపీ డేవిడ్‌రాజు, ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్‌, సంజీవ్‌, మల్లయ్యలు పాల్గోన్నారు.

Illegal |
Illegal |

Illegal |
Illegal |

Illegal |

Leave a Reply