గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.
ఈ కేసులో వంశీ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా, న్యాయమూర్తి వాదనలు విని బెయిల్ ఇవ్వడం సరైనది కాదని అభిప్రాయపడుతూ పిటిషన్‌ను కొట్టివేశారు. ఇప్పటికే ఇదే కేసులో అరెస్టయిన వంశీ, ప్రస్తుతం విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.