stockmarket | సెన్సెక్స్ 200 పాయింట్లు డౌన్‌.. నిఫ్టీ బలహీనం

stockmarket | సెన్సెక్స్ 200 పాయింట్లు డౌన్‌.. నిఫ్టీ బలహీనం

stockmarket | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలు, ముడి చమురు ధరల పెరుగుదల, అమెరికా బాండ్ ఈల్డ్స్ ప్రభావంతో మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. దీంతో సెన్సెక్స్‌, నిఫ్టీ సూచీలు ప్రారంభ ట్రేడింగ్‌లోనే నష్టాలను నమోదు చేశాయి.

వరుసగా మూడోరోజు కూడా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం 09:46 గంటల సమయానికి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 57 పాయింట్లు తగ్గి 23,325 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 202 పాయింట్లు కోల్పోయి 74,344 వద్ద కొనసాగుతోంది. పెట్టుబడిదారులు జాగ్రత్త ధోరణి అవలంబిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

అమెరికా డాలర్ ఇండెక్స్‌ 98.32 వద్ద కొనసాగుతుండగా, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 106.5 డాలర్లకు చేరింది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్ 4.46 శాతానికి పెరగడం కూడా మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. గత ట్రేడింగ్ సెషన్‌లో యూఎస్ ఎస్‌అండ్‌పీ సూచీ 0.16 శాతం, నాస్‌డాక్‌ 0.71 శాతం నష్టపోయాయి.

Leave a Reply