Government | మహిళల శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం

Government | మహిళల శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం
Government | మునుగోడు, ఆంధ్రప్రభ : మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ కోటీశ్వరులు అయ్యే స్థాయికి చేరుకోవాలని ప్రభుత్వం(Government) కట్టుబడి ప్రతి పథకం అమలులో మహిళలకు ప్రాధాన్యం చేస్తోందని కొరటికల్ సర్పంచ్ అద్దంకి రామలింగయ్య అన్నారు. ఈ రోజు నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కొరటికల్ గ్రామంలో ఇందిరా మహిళా శక్తి చీరలను మహిళలకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించడం ద్వారా వారి దైనందిన ఖర్చులు తగ్గి, సామాజిక-ఆర్థిక(Socio-economic) రంగాల్లో అభివృద్ధి చెందుతారన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సోమనబోయిన శ్రీనివాస్, ఉపసర్పంచ్ మందుల అంజయ్య, వార్డు సభ్యులు దండు లింగస్వామి, అద్దంకి భారతమ్మ, చింతపల్లి సుశీల, అద్దంకి వెంకన్న, మాదిరెడ్డి దేవకమ్మ, బొల్లం యాదయ్య, బోడిశ మల్లేష్, కురపాటి గిరి, వి బి కే బేరి రామదాసు తదితరులు పాల్గొన్నారు.
