ASHA Workers | అక్రమ అరెస్టులను ఖండిద్దాం..

ASHA Workers | అక్రమ అరెస్టులను ఖండిద్దాం..
ASHA Workers, వెల్డండ, ఆంధ్రప్రభ : అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆశా వర్కర్లకు ఎలాంటి సమాచారం లేకుండా ముందస్తు అరెస్టు చేయడం తగదని సీఐటీయు జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు తీవ్రంగా మండిపడ్డారు. సోమవారం ఉదయం 4 గంటల నుండి ఆశా కార్యకర్తలను ఇంటి దగ్గరకు వెళ్లి ముందస్తు అరెస్టులు చేయడం దేనికని.. అతి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్న పోలీసులను నిలదీయండి అని ఆశా వర్కర్లకు వారు తెలిపారు. ముందస్తు అరెస్ట్ అయిన వారిలో బాలమణి, అనిత, సుజాత, యాదమ్మ, పద్మలు ఉన్నారు.
