NREGS Scheme | ప‌థ‌కం పేరు మార్పుపై నిర‌స‌న

NREGS Scheme | ప‌థ‌కం పేరు మార్పుపై నిర‌స‌న

NREGS Scheme | కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని నచ్చన్‌ఎల్లాపూర్ గ్రామంలో స్థానిక గ్రామ సర్పంచ్ బొడ్డు స్పందన గ్రామగంగన్న ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ పథకం పేరును మార్చడాన్ని కండిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, పేదల ఉపాధికి భరోసా ఇచ్చే ఎన్ఆర్‌ఈజీఎస్ పథకం పేరును మార్చడం అనవసరమని, ఇది ప్రజలను గందరగోళానికి గురి చేస్తుందని విమర్శించారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు పోతారాజుల గంగన్న, ఉపసర్పంచ్ లక్ష్మి ఆనంద్, వీడీసీ అధ్యక్షుడు నర్సయ్య, వార్డు మెంబర్స్ ఉదయ్, బదుబాయ్ తుకారాం, లక్ష్మి శంకర్, యువకులు గంగాధర, వెంకటేష్, శ్రీనివాస్, చిన్నయ్య, గ్రామస్తులు పోషన్న, రామన్న, నారాయణ, లింగన్న, కార్యకర్తలు, గ్రామస్తులు, మహిళలు నిరసనకు మద్దతు తెలిపారు.

Leave a Reply