Telangana MLAs | జంప్ జిలానీలకు ఓటరే జడ్జి!

Telangana MLAs | జంప్ జిలానీలకు ఓటరే జడ్జి!

  • ప్రజాకోర్టులో తప్పని ఉరి
  • ఫిరాయింపు ప్రజాప్రతినిధుల భవితవ్యం సమాధి
  • తెలంగాణ ఏర్పాటు తర్వాత పార్టీ మారిన వారికి తప్పని చిక్కులు
  • డిస్ క్వాలిఫికేషన్పై స్పీకర్, న్యాయ వ్యవస్థల ద్వారా చర్యలు ఆలస్యం
  • గ్రేటర్ మినహా మిగిలిన చోట్ల ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఛీత్కారం
  • పార్టీ మారితే ప్రజాకోర్టులో వేటే.. గత ఫలితాలు చెప్పింది ఇదే!
  • రాజకీయ అవకాశవాదులకు చుక్కలు చూపిస్తున్న ఓటర్ దేవుళ్లు

Telangana MLAs | హైదరాబాద్, ఆంధ్రప్రభ : పొలిటికల్ బ్యూరో: రాజకీయ క్రీ(నీ)డలో అధికారం కోసం అడ్డదారులు తొక్కుతూ.. పక్కదారులు పడుతున్న అవకాశవాదులకు ప్రజలు కర్రుకాల్చి వాత పెడుతున్నారు. రాజకీయ పార్టీ నేతలుగా ప్రజలకు చేరువై.. పార్టీ ఎన్నికల గుర్తుతో గెలిచి.. అవసరాల కోసం మరో రాజకీయ పార్టీ వైపు ఆకర్షితులవుతూ.. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాభిప్రాయానికి విలువనివ్వని రాజకీయ వ్యభిచారులకు ఓటర్ దేవుళ్లు రాజకీయ సమాధి కడుతున్నారు. రాజకీయ సంఘ బహిష్కరణను(Boycott of political organizations) తలపించేలా ప్రజలు శిక్ష విధిస్తున్నారు. ప్రజాతీర్పును శిరసా వహించకుండా వ్యవ సల్లో లోపాలను అడ్డం పెట్టుకొని చర్యల నుంచి తప్పించుకుంటున్నామని కొంతకాలం పాటు అధికారం మాటున జల్సా చేస్తున్నప్పటికీ.. కాలగమనంలో వారిని ప్రజలే దూరం నెడుతున్న పరిస్థి తులు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. అక్రమాలు, అవినీతి, బంధుప్రీతి వంటి చారిత్రక తప్పి దాలకు పాల్పడుతూ, అవకాశవాద రాజకీయాలు చేస్తున్న వారి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజన తర్వాత పార్టీలు మారిన అనేకమందికి ప్రజలు తమ పాశుపతాస్త్రం లాంటి ఓటనే ఆయుధంతో ఇంటికి పరిమితం చేసిన ఘటనలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి అద్దం పడుతున్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి ౧లిచి.. నాటి టీఆర్ఎస్ (నేటి బీఆర్ఎస్)లో చేరిన ఎమ్మెల్యేల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కొందరు మినహా.. మిగిలిన అందరూ ప్రజాతీర్పుతో ఇంటికి పరిమితమయ్యారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి, కారు పార్టీలో చేరిన 12 మంది ఎమ్మెల్యేల్లో పదిమందిని ప్రజలు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో చిత్తుగా ఓడించి(Having been defeated in the election) ఛీత్కరించారు. దీంతో వ్యవస్థలను అపహాస్యం చేస్తూ.. ప్రజాస్వామ్యానికే మాయని మచ్చగా మారుతున్న అవకాశవాద లీడర్లకు ప్రజాస్వామ్యబద్ధంగానే ప్రజలు ఉరి వేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు, మేధావులు పేర్కొంటున్నారు. అధికారమే పరమావధిగా హామీలు గుప్పించే రాజకీయ పార్టీలకంటే, అధికారం కోసం పార్టీలు మారే ప్రజా ప్రతిని ధుల విషయంలో మాత్రం ప్రజల విశ్వాసం రోజురోజుకు స న్నగిల్లుతోంది.

పార్టీ మారిన ఎందరో ప్రజాప్రతినిధులు ఆ తరువాత ఓటమి చెందడం భారతదేశ ప్రజాస్వామ్యం చాటుతున్న స్పూర్తికి నిదర్శ నంగా నిలుస్తోంది. కాసింత ఆల స్యమైనా సరే ప్రజలు మాత్రం సరైన తీర్పుతో అవకాశవాద రాజకీయ నాయకుల(Opportunistic politicians)ను శిక్షిస్తున్నట్లు పలు ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటు తరువాత గులాబీ గూటికి చేరి, మంత్రి పదవులను అనుభవించిన ఇంద్రకరణ్ రెడ్డి వంటి వారిని ప్రజలు దూరం పెట్టడాన్ని రాజకీయ విమర్శ కులు, మేధావులు ఉదహరిస్తున్నారు. అవకాశవాద రాజకీ యాలకు తెగబడుతూ పార్టీ మారిన అనేక మంది రాజకీయ జీవితం, వారి భవితవ్యం(Future) చీకటిమయంగా మారిందని వారు గుర్తు చేస్తున్నారు.

రాష్ట్ర విభజనకు ముందు రాజకీయాల్లో అగ్రనేతలుగా వెలుగొంది, ఆ తరువాత పార్టీ మారిన ఎందరో ప్రజల విశ్వాసం కోల్పోయి, ప్రస్తుతం రాజకీయ నిరుద్యోగులుగా కాలం గడుపుతున్నట్లు వారు పేర్కొంటున్నారు. అగ్రనేతలుగా వెలిగిన వారి రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, వారి వారసులు సైతం లైమ్ లైట్లోకి(Heirs also enter the limelight) వచ్చేందుకు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొం టున్నారని, నిత్యం ప్రజల మధ్య గడపడం, జనం అభిప్రాయా లకు విలువనివ్వడం, కబ్జాలు, అవినీతి, ఆశ్రీత పక్షపాతం వంటి వాటికి దూరంగా ఉంటేనే ప్రజలు విశ్వసిస్తారని, అందు కు అనేక ఉదాహరణలు ఉన్నాయని సామాజికవేత్తలు పేర్కొం టున్నారు. కరుడు గట్టిన రాజకీయ వాదిగా ప్రజల్లో ముద్ర ఉన్నా, ప్రజల విశ్వా సం కోల్పోతే అంతే సంగతులని వారు హెచ్చరిస్తున్నారు.

Telangana MLAs | ప్రశ్నార్థకంగా ఫిరాయింపు ఎమ్మెల్యేల భవితవ్యం

2014 నుంచి నేటి వరకు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం చర్చనీయాంశాలుగానే మారాయి. పార్టీ ఫిరాయింపుల వ్యవహారం భారతదేశ ప్రజాస్వామ్య స్ఫూర్తిని, మెజారిటీ ప్రజల తీర్పును పరిహాసం చేస్తోంది. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా బరిలో నిలిచి, గెలిచిన వారిలో దాదాపు 12 మంది ఎమ్మెల్యేలు 2019 జూన్ లో అధికార గులాబీ గూటికి చేరారు. మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో రెండొంతుల మంది విలీనానికి(For the merger of two halves) మొగ్గు చూపడంతో, భారత రాజ్యాంగంలోని యాంటీ డిఫెక్షన్ చట్టం ప్రకారం స్పీకర్ ఈ విలీనాన్ని ఆమోదించారు. కాంగ్రెస్ నుంచి గెలిచి, పార్టీ మారి 2023లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి, గెలవడం ద్వారా మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాత్రమే ప్రస్తుతం ఎమ్మెల్యేలు(MLAs) గా కొనసాగుతున్నారు.

హస్తాన్ని వీడి, కారెక్కిన వారిలో పదిమంది ఎమ్మెల్యేలు భారీ తేడాతో ఓటమి పాలు కావడం ప్రజల వ్యతిరేకతకు అద్దం పడుతోంది. కాంగ్రెస్ నుంచి గెలిచి, బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న పైలట్ రోహిత్ రెడ్డి(తాండూరు 6,583), రేగా కాంతారావు (పినపాక 34,506), బి.హర్షవర్ధన్రెడ్డి (కొల్లాపూర్ 29,931), గండ్ర వెంకటరమణరెడ్డి (భూపాలపల్లి 52,699), జే. సురేందర్ (ఎల్లారెడ్డి 24,001), బానోత్ హరిప్రియ నాయక్ (ఇల్లెందు 57,301), వనమా వెంకటేశ్వరరావు (కొత్తగూడెం 80,336), కందాల ఉపేందర్ రెడ్డి (పాలేరు 56,650), చిరుమర్తి లింగయ్య (నకిరేకల్ 68,839) ఓట్ల తేడాతో పరాజయం పాలుకావడం ప్రజాతీర్పును అపహాస్యం చేయడం పట్ల జనం ఎంత ఆగ్రహంగా ఉన్నారో స్పష్టం చేస్తోంది.

Telangana MLAs | కాంగ్రెస్ పాలనలోనూ..

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్పై గెలిచిన 10మంది ఎమ్మెల్యేలు 2024లో కాంగ్రెస్ పార్టీలో చేం రా లేదా అన్న విషయమై రాజకీయ దుమారం చెలరేగుతోంది. శాస్త్రీయ ఆధారాలు, న్యాయపరమైన చిక్కులు(Scientific evidence, legal implications) వంటి అనేక అంశాలు ఈ కేసులను ప్రభావితం చేస్తుండగా, తెలంగాణ రాజకీయాలు మరింత హీటెక్కా యి. పదిమంది ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారం బీఆర్ఎస్కు కోలుకోలేని దెబ్బగా మారగా, ఆ పార్టీ న్యాయపో రాటం సాగిస్తోంది. పార్టీ మారలేదంటూ ఆరోపణ లు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలు ప్రజల్లో హేళనకు గురవుతున్నాయి.

ఇప్పటికే తెల్లం వెంకట్రావు (భద్రాచలం), బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (గద్వాల్), టీ.ప్రకాష్ గౌడ్ (రాజేంద్ర నగర్), అరెకపూడి గాంధీ (శేరిలింగంపల్లి), గూడెం మహిపాల్ రెడ్డి(పటాన్ చెరు) పార్టీ ఫిరాయింపు వ్యవహారం(Party defection issue)పై స్పీకర్ విచారణ పూర్తి కాగా, పార్టీ మారినట్లు సరైన ఆధారాలు లేవన్న కారణం చూపి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టివేసినట్లు ప్రకటించగా, పోచారం శ్రీనివాస్ రెడ్డి (బాన్సువాడ), ఎం.సంజయ్ కుమార్ (జగిత్యాల), కాలే యాదయ్య (చేవెళ్ల) విచారణ పూర్తి కాగా, తీర్పు వెలువడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించినప్పటికీ, కాంగ్రెస్లో కొనసాగుతున్నట్లు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

Telangana MLAs | గ్రేటర్లో మరో రకం తీర్పు

రాష్ట్రమంతటా కాంగ్రెస్ పార్టీకి అనుకూల తీర్పు వస్తే, 2023 ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు మరో రకమైన తీర్పుతో బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన 2014లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి 15 మంది ఎమ్మెల్యేలుగా గెలవగా, వీరిలో 12 మంది సైకిల్ దిగి, కారెక్కారు. 2/3 మెజారిటీ సభ్యుల తీర్మానం మేరకు టీడీఎల్పీని టీఆర్ఎస్ (నేటి బీఆర్ఎస్)లో విలీనం చేసినట్లు ఆనాటి స్పీకర్ మధు సూదనాచారి ప్రకటించారు. 2014 చివరిలో సనతనగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్ చేరి, వరుస విజయాలు(Success in a row) సాధించడంతో పాటు బీఆర్ఎస్ హయాంలో రెండు పర్యాయాలు మంత్రిగా కొనసాగారు. 2016 ఫిబ్ర వరిలో అప్పటి టీడీపీ శాసనసభా పక్షనేత ఎర్రబెల్లి దయా కర్రావు నేతృత్వంలో పది మందికి పైగా ఎమ్మెల్యేలు టీ ఆర్ఎస్లో విలీనం చేయాలని అసెంబ్లీ స్పీకర్కు లేఖ(Letter to the Assembly Speaker)ను అందజేయగా, 2016 మార్చిలో స్పీకర్ ఎస్.మధుసూదన చారి, 15మందిలో 12మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో విలీనమైనట్లు అధికారికంగా ప్రకటించారు.

వీరిలో గ్రేటర్ హైదరాబాద్కు చెందిన సనతనగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తదితరులు 2018, 2023 ఎన్ని కల్లోనూ విజయం సాధించారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ (2018, 2023 ఎన్నికల్లోనూ విజయం సాధించినప్పటికీ) కాంగ్రెస్లో చేరిన విషయమై ప్రస్తుతం విచారణ సాగుతోంది. 2014లో టీడీపీ ఎమ్మెల్యేలుగా ౧లిచి, టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న వారిలో మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి (2018లో ఓటమి), కంటోన్మెంట్ ఎమ్మెల్యే జీ.సాయన్న (2018లో గెలిచినప్పటికీ అకాల మరణంతో ఉపఎన్నిక), పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి (2018లో విజయం, 2023లో ఓటమి), పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు (2018లో విజయం, 2023లో ఓటమి), నారాయణపేట్ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి (2018లో విజయం, 2023లో ఓటమి), ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి (2018లో విజయం 2023లో ఓటమి చెందారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్ చేరిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (2018, 2023) వరుస విజయాలు సాధించినప్పటికీ 2025లో అకాల మరణం చెందారు. 2014, 2018లో టీడీపీ నుంచి ఎత్తుపల్లి ఎమ్మెల్యేగా గెలుపొందిన సండ్ర వెంకటవీరయ్య 2023లో ఓటమి చెందారు. 2018లో అశ్వారావుపేటటీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన మెచ్చా నాగేశ్వరరావు, పార్టీ మారి టీఆర్ఎస్లో చేరి, 2023లో ఓటమి పాలయ్యారు.

Leave a Reply