Mancheriala | పోస్టర్లు ఆవిష్కరణ

Mancheriala | పోస్టర్లు ఆవిష్కరణ
- ముదిరాజ్ల ప్రతిష్ట పెంచేలా ముందుకు సాగాలి
- పశుసంవర్ధక శాఖ రాష్ట్ర మత్రి వాకిటి శ్రీహరి
Mancheriala | మంచిర్యాల సిటీ, ఆంధ్రప్రభ : ముదిరాజ్లు జాతి ప్రతిష్ట పెంచేలా ముందుకు సాగాలని భవిష్యత్ తరాలకు మార్గదర్శకులుగా ఉండాలని, సంఘాలు వేరైనా ఐక్యంగా ముందుకు సాగి కార్యక్రమాల విజయవంతానికి కృషి చేయాలని పశుసంవర్ధక శాఖ రాష్ట్ర మత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. శనివారం ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్, మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చొప్పరి శంకర్, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి దబ్బేట తిరుపతి ఉమ్మడిగా పోస్టర్లు విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 30న హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగే సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్ల సన్మాన కార్యక్రమం ఘనంగా ఉండాలన్నారు. వచ్చే గ్రామ ప్రజాప్రతినిధులను గౌరవప్రదంగా సత్కరించాలని, సంఘాలకు అతీతంగా ఈ కార్యక్రమం జరగాలని, రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి కార్యక్రమం వెళ్లేలా కార్యాచరణ ఉండాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక కమిటీలను పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ నేతృత్వంలో సంఘాలన్నీ సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు. బీసీ డీ నుంచి ఏ లోకి మార్చే ప్రతిపాదన ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఉమ్మడిగా చేయాల్సి ఉంటుందని చెప్పారు. రాష్ట్ర రాజధానిలో ముదిరాజ్ భవన నిర్మాణం పై త్వరలోనే ప్రత్యేక దృష్టి ఉందని, ఈ కార్యక్రమ తదుపరి కార్యాచరణ వెల్లడించనున్నట్లు మంత్రి చెప్పారు.
కార్యక్రమంలో ముదిరాజ్ ప్రొఫెసర్లతో పాటు సీనియర్ నాయకులు, హైదరాబాద్ డీసీసీ అధ్యక్షులు ముక్తా రోహిత్ ముదిరాజ్, మహబూబ్నగర్ డీసీసీ అధ్యక్షులు అంగంపల్లి సంజీవ్ ముదిరాజ్, మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర యువత అధ్యక్షులు బొమ్మెర గోని రాజు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
