Crazy combo | ఊ.. అంటారా..?

Crazy combo | ఊ.. అంటారా..?
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఇండస్ట్రీలో కొంత మంది హీరోలకు.. కొంత మంది దర్శకుల పై గురి ఉంటుంది. ఆ హీరో, ఆ డైరెక్టర్ కలిసి సినిమా చేస్తే.. బొమ్మ బ్లాక్ బస్టరే(Blockbuster) అనే నమ్మకాన్ని అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ క్రియేట్ చేశారు. ఒకరి పై ఒకరికి ఎంత నమ్మకం అంటే.. కథ పూర్తిగా చెప్పకపోయినా.. ఇంకా చెప్పాలంటే.. అసలు కథే చెప్పకపోయినా.. ఆయ దర్శకుల(Those directors) పై ఉన్న నమ్మకంతో ఓకే చెబుతుంటారట హీరోలు. ఇంతకీ.. అంతలా నమ్మకం ఏర్పరుచుకున్న హీరోలు, దర్శకులు ఎవరు…?
Crazy combo | చిరు, కోదండరామిరెడ్డి..

మెగాస్టార్ చిరంజీ.. కెరీర్ ఆరంభంలో తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని(Taking advantage) ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు వెళ్లారు. అయితే.. చిరు నట ప్రస్థానం ప్రారంభించిన తొలినాళ్లలో కోదండరామిరెడ్డి పై ఆయనకు బాగా గురి. వీరిద్దరి కాంబోలో న్యాయం కావాలి వచ్చింది. ఆతర్వాత ఖైదీ రూపొందింది. ఖైదీ సినిమా(Prisoner movie) చిరు కెరీర్ ను మలుపు తిప్పింది. ఇక ఆతర్వాత అభిలాష, గుండా, ఛాలెంజ్, దొంగ, రాక్షసుడు, పసివాడి ప్రాణం, దొంగ మొగుడు, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, కొండవీటి దొంగ, ముఠామేస్త్రి తదితర చిత్రాలు వచ్చాయి. వీరి కాంబినేషన్లో వచ్చిన దాదాపు అన్ని సినిమాలు సక్సెస్ సాధించడం విశేషం.
Crazy combo | బాలయ్య, బి.గోపాల్..

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బి గోపాల్ ది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్(Successful combination). వీళ్లిద్దరి కలయికలో మొత్తంగా 5 చిత్రాలు వచ్చాయి. అందులో బ్లాక్ బస్టర్స్‌తో పాటు ఇండస్ట్రీ హిట్ మూవీస్ ఉన్నాయి.. తొలిసారి బాలయ్య, బి.గోపాల్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా లారీ డ్రైవర్. ఈ చిత్రం బాక్సాపీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్టైయింది. ఈ సినిమాలో బాలయ్య సరసన విజయ శాంతి హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ మ్యూజికల్‌గా కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆతర్వాత వీరి కాంబోలో వచ్చిన రౌడీ ఇన్‌స్పెక్టర్(Rowdy Inspector) సంచలన విజయం సాధించింది. సమరసింహారెడ్డి సినిమా ఫ్యాక్షన్ సినిమాలకు ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. నరసింహనాయుడు కూడా రికార్డులను తిరగరాసింది. ఇక వీరి కాంబోలో వచ్చిన పలనాటి బ్రహ్మనాయుడు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్(Disaster) అయ్యింది. అయితే.. బి.గోపాల్ అంటే.. ఇప్పటికీ బాలయ్యకు గురి.
Crazy combo | బాలయ్య, బోయపాటి..

ఈ జనరేషన్లో.. బాలయ్యను ఎలా చూపించాలో.. ఎలా చూపిస్తే.. జనాలకు బాగా నచ్చుతుందో బాగా తెలిసిన డైరెక్టర్ బోయపాటి శ్రీను(Director Boyapati Srinu). బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన ఫస్ట్ మూవీ సింహా. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆతర్వాత ఈ కాంబోలో లెజెండ్ వచ్చింది. ఈ సినిమా కూడా అంతే.. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆతర్వాత ముచ్చటగా మూడోసారి ఈ మాస్ హీరో బాలయ్య, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి కలిసి అఖండ అంటూ మరో సినిమా(Another movie) చేశారు. ఈ సినిమా అయితే.. అంతకు మించి అన్నట్టుగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంది. లేటెస్ట్ గా అఖండ మూవీకి సీక్వెల్ గా అఖండ 2 వచ్చింది. ఈ సినిమా కూడా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. అయితే.. బాలయ్యకు బోయపాటి పై ఎంత నమ్మకం అంటే.. కథ కూడా వినరట. జస్ట్ స్టోరీ ఐడియా చెబితే.. మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారా.? అని అడుగుతారట. కాన్ఫిడెంట్(Confident) గా ఉన్నానని చెబితే.. ఓకే అని చెబుతారట బాలయ్య. ఈ విషయాన్ని స్వయంగా బోయపాటి ఓ ఇంటర్ వ్యూలో బయటపెట్టారు.
Crazy combo | నాగార్జున – రాఘవేంద్రరావు..

నాగార్జునకు రాఘవేంద్రరావు(Raghavendra Rao) అంటే గురి. వీరిద్దరి కాంబోలో ఆఖరి పోరాటం, అగ్నిపుత్రుడు, జానకి రాముడు, అగ్ని, ఘరానా బుల్లోడు, అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడి సాయి, ఓం నమో వెంకటేశాయ చిత్రాలు వచ్చాయి. ఈ సినిమాలు అన్నింటిలో అన్నమయ్య సినిమా ఓ సంచలనం.. ఓ చరిత్ర అని చెప్పచ్చు. అప్పటి వరకు నాగార్జునను ఎవరూ చూపించని సరికొత్త కోణంలో(In a whole new sense) భక్తరస కోణంలో చూపించారు. నాగార్జున అన్నమయ్య అనగానే.. నాగార్జున ఏంటి..? అన్నమయ్యగా నటించడం ఏంటి అనుకున్నారు కానీ.. నాగార్జున పై దర్శకేంద్రుడు నమ్మకం.. దర్శకేంద్రుడు(Director) పై నాగార్జున నమ్మకం.. నిజం అయ్యాయి. అన్నమయ్య సినిమా నాగార్జున కెరీర్ లోనే కాదు.. తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ మరచిపోలేని సినిమాగా నిలిచింది.
Crazy combo | పవన్ – త్రివిక్రమ్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Magician Trivikram Srinivas).. ఈ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వీరిద్దరూ కలసి చేసిన ఫస్ట్ మూవీ జల్సా. ఈ సినిమాలో పవన్ ను అభిమానులు ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా చూపించడంతో బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆతర్వాత అత్తారింటికి దారేది అనే సినిమా చేస్తే.. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ ని షేక్(Shake the box office) చేసింది. ఆతర్వాత చేసిన అజ్ఞాతవాసి మాత్రం నిరాశపరిచింది. పవన్ ఏ సినిమా చేయాలన్నా త్రివిక్రమ్ ఉండాల్సిందే. ఆయన కథ విని ఒకే చెబితేనే.. పవన్ సినిమా చేస్తారు. అంతలా ఇద్దరి మధ్య అనుబంధం ఏర్పడింది. బ్రో సినిమాకి సముద్రఖని దర్శకత్వం వహించినా.. మాటలు మాత్రం త్రివిక్రమ్ అందించారు. ఇలా కొంత మంది హీరోలకు(To the heroes) కొంత మంది దర్శకుల పై గురి ఏర్పడింది. పైన చెప్పిన వాళ్లే కాకుండా.. మరి కొంత మంది హీరోలకు దర్శకుల పై నమ్మకం ఏర్పడడంతో వరుసగా సినిమాలు చేస్తున్నారు.. వరుసగా బ్లాక్ బస్టర్స్(Blockbusters) సొంతం చేసుకుంటున్నారు.
