Canada | భారత విద్యార్థిని కాల్చి చంపిన దుండగులు

Canada | భారత విద్యార్థిని కాల్చి చంపిన దుండగులు
Canada | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కెనడా (Canada) లోని టొరంటోలో భారతీయ విద్యార్థుల భద్రతపై మరోసారి తీవ్ర ఆందోళన కలిగించే దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్న భారత విద్యార్థులపై జరుగుతున్న దాడులు, హత్యలు ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి…
తాజాగా.. కెనడాలోని టొరంటోలో భారత విద్యార్థి (Indian student) హత్యకు గురయ్యాడు. టొరంటో స్కార్బొరౌగ్ (Toronto Scarborough) విశ్వవిద్యాలయంలో చదువుతున్న శివాంక్ అవస్థిని దుండగులు కాల్చి చంపారు (Shot dead). స్థానిక హైల్యాండ్ క్రీక్ ట్రెయిల్ వద్ద ఈ ఘటన జరిగింది. తాము వచ్చే లోపు నిందితులు పారిపోయారని పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో తాత్కాలికంగా కళాశాల క్యాంపస్ (College campus) ను మూసివేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై భారత రాయబార కార్యాలయం తీవ్ర విచారం వ్యక్తం చేసింది.
