TNSF | వెంకట దాస్ భౌతికకాయం వద్ద నివాళి

TNSF | వెంకట దాస్ భౌతికకాయం వద్ద నివాళి
TNSF | నాగాయలంక, ఆంధ్రప్రభ : నాగాయలంక మండలం పర్రచివర శివారు బిల్లిగ్రాహం నగరులో గ్రామ ప్రముఖులు, డీసీసీ మాజీ కార్యదర్శి, స్టేట్ హౌసింగ్ బోర్డు(State Housing Board) మాజీ డైరెక్టర్, మండలి వెంకట కృష్ణారావు స్నేహితులు మంచాల వెంకట దాస్ (92) మృతి చెందారు. గురువారం ఆయన భౌతికకాయాన్ని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్(MLA Mandali Buddhaprasad), నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ సందర్శించి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు.
వెంకటదాస్ కుమారుడు, టీడీపీ మండల నాయకులు మంచాల తిరుపతి వరప్రసాద్ (బాబు), మనుమడు, టీఎన్ఎస్ఎఫ్(TNSF) జిల్లా నాయకుడు మంచాల మహేంద్రకుమార్ రాజాలను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తెలుగు మహిళ మచిలీపట్నం పార్లమెంట్ అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత, జనసేన మండల నాయకులు బండ్రెడ్డి హరి, కూటమి నాయకులు నివాళులు అర్పించారు.
