Pokhran nuclear tests | మాజీ ప్రధాని వాజపేయి జయంతి వేడుకలు

Pokhran nuclear tests | మాజీ ప్రధాని వాజపేయి జయంతి వేడుకలు
Pokhran nuclear tests | మేడ్చల్, ఆంధ్రప్రభ : భారత మాజీ ప్రధానమంత్రి, అజాతశత్రువు, భారతరత్న అటల్ బిహారీ వాజపేయి(Atal Bihari Vajpayee) జయంతి వేడుకలను ఈరోజు భారతీయ జనతా పార్టీ గుండ్లపోచంపల్లి డివిజన్ అధ్యక్షుడు కావేరి శ్రీధర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక గుండ్లపోచంపల్లి డివిజన్ ఆఫీస్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా రాష్ట్ర బీజేపీ నాయకులు విక్రమ్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. అటల్ జీ భారత రాజకీయాల్లో ఒక ధృవతార అని కొనియాడారు. “దేశం కోసం జీవించి, దేశం కోసం ఆలోచించిన మహనీయుడు వాజపేయి. ఆయన హయాంలో జరిగిన పోఖ్రాన్ అణు పరీక్షలు(Pokhran nuclear tests), స్వర్ణ చతుర్భుజి రహదారుల నిర్మాణం, గ్రామీణ రోడ్ల అభివృద్ధి భారతదేశ గమనాన్ని మార్చివేశాయి” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అమరం మోహన్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు దొడ్ల మల్లికార్జున్ ముదిరాజ్, అమరం సరస్వతి, ప్రధానకార్యదర్శులు జైతులా కృష్ణ, చింతలపూడి రామారావు, బీజేపీ నాయకులు మాలిగే అశోక్, చెంచల సురేష్, మహేష్, సుంకు నవీన్, బట్టికడి నవనీత, యాదగిరి, మహేష్ ,అభిలాష్ ,శాంతన్ రెడ్డి, సుహాసిని, ఆంజనేయులు, విమాలేష్ పాండే, శ్రవణ్, భారత్, శివ, శ్రీనివాస్ గౌడ్, భాను తదితరులు పాల్గొన్నారు.
