హైదరాబాద్: సినీ నటుడు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ప్రజావాణి కార్యక్రమానికి వచ్చారు. ఈ క్రమంలో తన ఇంటి స్థలం గురించి నేడు జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్-92లో తమ ప్రాపర్టీస్ విషయంపై పునరాలోచించాలని ప్రజావాణిలో ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదు అందించారు. ఈ సందర్భంగా కేబీఆర్ పార్కు వద్ద రోడ్డు విస్తరణలో తన ఇంటి స్థలం సేకరణపై పునరాలోచన చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. రోడ్డు విస్తరణలో తన ప్లాటు ఒకవైపు 20 అడుగులు మరోవైపు 36 అడుగుల భూమి సేకరించే అంశంపై వివరణ ఇవ్వాలంటూ అధికారులను కోరారు.
.
కాగా, కొన్ని నెలల క్రితం కేబీఆర్ పార్కు చుట్టూ జంక్షన్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం రూ.1100 కోట్లు ఖర్చు చేయాలని అధికారులు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే రోడ్డు విస్తరణతో పాటుగా పలు కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా ఈ ప్రాంతం లోని పలువురు సెలబ్రిటీస్ ఇళ్లకు మార్కింగ్ చేశారు అధికారులు.
.