4months | చలితో విలవిల..

4months | చలితో విలవిల..
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : చలికాలంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఇబ్బందులు తప్పవు. వానాకాలం, ఎండాకాలం కంటే శీతాకాలం చాలా భిన్నమైన వాతావరణం ఉంటుంది. ఈ సీజన్‌లో (Season) ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదవుతుంటాయి. దీంతో చిన్న పిల్లలతో సహా అధిక వయసు వారు తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు. అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మొదటికి ముప్పు వచ్చే అవకాశం ఉంది.

చలికాలం (Winter Season) అతిగా తినొద్దు. ఈ సీజన్‌లో రుచికరమైన ఆహారపదార్థాలు తినాలనిపిస్తుంది. కానీ ఎక్కువగా తింటే మధుమేహం, ఫ్యాటీ లివర్, గుండె జబ్బులు తదితర అనేక వ్యాధులకు కూడా కారణం కావచ్చు.
చలికాలంలో నీరసంగా, బద్ధకంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో సరైన ఆహారం తీసుకోవాలి. ఆహారంలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, కార్బోహైడ్రేట్లను సమతుల్య పరిమాణంలో తీసుకోవడం ఉత్తమం. ఇలా చేస్తే యాక్టివ్ గా(Active) ఉండవచ్చు.

చలి తీవ్రతకు రక్త ప్రసరణ మందగిస్తుంది. ఈ కారణంగా శరీరం నొప్పులుగా ఉంటుంది. అలాగే మానసిక సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో శారీరక శ్రమ తప్పక ఉండాలి. వ్యాయామం చేయడం ద్వారా శరీరంలోని కండరాలు దృఢంగా మారతాయి.
చలికాలంలో చాలామంది ఇంట్లోనే ఉండిపోతారు. ఎక్కువగా ఎండలోకి వెళ్లరు. దీంతో విటమిన్-డి (Vitamin-D) లోపం ఏర్పడి శరీరం బద్దకంగా మారుతుంది. విటమిన్ “డి” లోపం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అందువల్ల, ప్రతిరోజూ కొంత సమయం పాటు సూర్యరశ్మి శరీరానికి తగిలేలా చూసుకోండి. వీటితో పాటు గుడ్లు, చేపలు మొదలైన వాటిని ఆహారంలో చేర్చుకోవాలని పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు.

4months | ఉదయం పొగమంచులో
- శరీరాన్ని వెచ్చగా ఉంచుకోండి. ఉదయం, రాత్రి వేళల్లో చలి ఎక్కువగా ఉంటుంది. స్వెట్టర్లు, షాల్స్, మఫ్లర్లు, దుప్పట్లు వాడాలి. చల్లని గాలికి నేరుగా గురికాకుండా జాగ్రత్తపడాలి.
- వేడి ఆహారం, పానీయాలు తీసుకోండి. వేడి నీరు, టీ, కాఫీ, సూపులు తాగడం మంచిది. వేడి ఆహారం శరీరానికి శక్తిని ఇస్తుంది, చలి ప్రభావాన్ని తగ్గిస్తుంది.
- కూరగాయలు, పండ్లు, గుడ్లు వంటి పోషకాహారం తీసుకోవాలి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
- చాలా చల్లని నీటితో స్నానం చేయకండి. గోరువెచ్చని నీరు వాడడం మంచిది. ఉదయం పొగమంచులో బయటకు వెళ్లకుండా ఉండండి
- ఉదయం వేళల్లో పొగమంచు ఎక్కువగా ఉంటుంది. అవసరం లేకపోతే బయటకు వెళ్లకపోవడం మంచిది.
- చలి వల్ల చర్మం పొడిగా మారుతుంది. నూనె లేదా మాయిశ్చరైజర్ వాడాలి. పెదవులు పగలకుండా జాగ్రత్త తీసుకోవాలి.
- చలి కాలంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. సరైన దుస్తులు, మంచి ఆహారం, శుభ్రత పాటించడం ద్వారా చలి ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు.
4months | నువ్వుల నూనెతో మర్దన
- అల్లం టీ, తులసీ టీ, మిరియాల సూప్ వంటివి దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
- పాదాల పగుళ్లు తగ్గాలంటే అరటిపండు గుజ్జును అప్లై చేసి.. పావుగంట తర్వాత కడగాలి
- కాళ్ల వాపులుంటే నువ్వుల నూనెతో మర్దన చేసుకుంటే ఫలితం ఉంటుంది.
- పెదాలు పొడిబారకుండా ఉండాలంటే వాటిపై కొబ్బరి నూనె/తేనె/పాలమీగడ రాసుకోవాలి
- చుండ్రు పోవాలంటే జుట్టును వేపనూనెతో మర్దన చేయాలి.
- ఇందులో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి.

