after6weeks | డెలివరీ తర్వాత బరువు తగ్గాలంటే..!

after6weeks | డెలివరీ తర్వాత బరువు తగ్గాలంటే..!
- డెలీవరీ తర్వాత శరీరంలో అనేక మార్పులు
- బరువు పెరగడం అనివార్యం
- సహజ పద్ధతుల వల్లే తగ్గాలి
- తిండి మానేయడం సరికాదు
after6weeks | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ప్రసవం తర్వాత స్త్రీ శరీరంలో కలిగే అనేక మార్పులలో బరువు పెరగడం ఒకటి. ఇది ఒకరి నుంచి మరొకరి శరీర తత్త్వాలను, ఆహారపుటలవాట్లను బట్టి ఎదురయ్యే సమస్యలు(problems), మార్పులు వేరుగా ఉండవచ్చు కానీ, సాధారణంగా బరువు పెరగడం మాత్రం దాదాపు అనివార్యమైపోయింది. అలాగని బరువు తగ్గాలనే కంగారులో మొత్తానికి ఆహరం అమాంతం తగ్గించేస్తే మొదటికే మోసం వస్తుంది.
అందుకే డెలివరీ(delivery) తర్వాత బరువు తగ్గాలంటే ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా తేలికపాటి వ్యాయామం చేయడం, పుష్కలంగా నీరు త్రాగడం, తల్లిపాలు ఇవ్వడం వంటివి ముఖ్యమైనవి. మీ శరీరం కోలుకోవడానికి సమయం ఇవ్వడం, డాక్టర్ సలహా(doctor’s advice) తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రసవం తర్వాత బరువు తగ్గడం అనేది క్రమంగా, సహజంగా జరగాలి.
ప్రసవానంతర సమస్యల్ని దూరం చేయడంలో వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం చేస్తూ క్యాలరీలు(calories) తక్కువగా, పోషకాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాల్ని డైట్లో చేర్చుకుంటే ప్రసవానంతరం త్వరగా, ఆరోగ్యకరంగా బరువు తగ్గవచ్చు.
after6weeks | బరువు తగ్గడం వలన కలిగే ప్రయోజనాలివే !
ప్రసవం తర్వాత శరీరం శక్తిని కోల్పోయి పూర్తిగా బలహీనపడుతుంది. అయితే ఈ శక్తిని తిరిగి కూడగట్టుకోవాలంటే.. వ్యాయామం చక్కటి మార్గం అంటున్నారు వైద్య నిపుణులు(Medical Experts). వ్యాయామం చేసే క్రమంలో ఎండార్ఫిన్లు, డోపమైన్, సెరటోనిన్ వంటి హ్యాపీ హార్మోన్లు(Happy Hormones) శరీరంలో విడుదలవుతాయి. ఇవి శరీరంలో శక్తిని పెంచడంతో పాటు ప్రశాంతతను అందిస్తాయని అంటున్నారు.
బిడ్డకు జన్మనిచ్చాక నిద్రలేమి, అలసటతో తీవ్రమైన ఒత్తిడి ఎదురవుతుంటుంది. అయితే విబిన్న వ్యాయామాలు, యోగా, ధ్యానం(Exercises, Yoga, Meditation) వంటివి ఒత్తిడిని తరిమి కొట్టి మానసిక ప్రశాంతతను అందిస్తాయి. ఇలా ప్రశాంతంగా ఉండడం వల్ల బిడ్డ ఎదుగుదలకు పరోక్షంగా మేలు జరుగుతుందని చెబుతున్నారు నిపుణులు.
గర్భదారణ సమయంలో దృడంగా ఉంచడానికి కొన్ని వ్యాయామాలు ఎలా మేలు చేస్తాయో ప్రసవానంతరం తిరిగి పూర్వపు స్థితికి తీసుకురావడంలో సహకరిస్తాయి(Helps). ముఖ్యంగా డెలివరి తర్వాత అధిక బరువును తగ్గించుకోవడం, పొట్ట తగ్గించుకోవడంలో ఇది మేలు చేస్తాయంటున్నారు నిపుణులు.
after6weeks | ఆరు వారాల తర్వాతే..!
సుఖ ప్రసవమైనా, సిజేరియన్ అయినా.. డెలివరీ అయిన ఆరు వారాల తర్వాతే వ్యాయామం మొదలు పెట్టమని సలహా ఇస్తుంటారు వైద్యులు. అయినా ఈ క్రమంలో ముందు ఓసారి డాక్టర్ వద్ద ఆరోగ్య పరిస్థితిని సమీక్షించుకున్నాకే ఎక్సర్ సైజ్ ప్రారంభించడం మంచిది. అలాగే దీన్ని బట్టీ మీరు ఎలాంటి వ్యాయామాలు చేయచ్చో కూడా డాక్టర్ సూచిస్తారు. సాధారణంగా బ్రిస్క్ వాకింగ్(Brisk Walking), ఈత, యోగా, సైక్లింగ్, పిలాటిస్, తక్కువ తీవ్రత ఉండే ఏరోబిక్ వ్యాయామాలు. పరుగు- జాగింగ్.. వంటివి ప్రసవానంతర సమస్యల నుంచి త్వరగా కోలుకునేందుకు తోడ్పడతాయంటున్నారు నిపుణులు. అలాగే ఒకేసారి ఎక్కువ సమయం వ్యాయామాలు చేయకుండా.. క్రమంగా కొంత సమయాన్ని పెంచుకుంటూ పోవడం మంచిదంటున్నారు నిపుణులు.
after6weeks | ఆహారంలో మార్పులు

పోషకాహారం తీసుకోవాలి అంటే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు (ఓట్స్, బ్రౌన్ రైస్), లీన్ ప్రోటీన్లు (గుడ్లు, పప్పులు, చేపలు), ఆరోగ్యకరమైన కొవ్వులు తినాలి. జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవాలి. రోజుకు కనీసం 2 లీటర్ల నీరు(2 Liters of Water) తాగాలి. ఇది కడుపు నిండిన అనుభూతినిస్తుంది. ఆరోగ్యకరమైన స్నాక్స్ (నట్స్, కట్ వెజిటబుల్స్) ఎంచుకోవాలి. అదే విధంగా తల్లిపాలు ఇవ్వడం వల్ల అదనపు కేలరీలు ఖర్చవుతాయి.
after6weeks | వ్యాయామం, నడక ముఖ్యం..
ప్రసవం తర్వాత కొన్ని రోజులకు నెమ్మదిగా నడవడం ప్రారంభించి తర్వాత వేగం పెంచాలి. శిశువును ఎత్తుకుని నడవడం కూడా మంచిది. శరీరం కోలుకున్న తర్వాత చురుకైన నడక, సైక్లింగ్(Cycling) వంటివి చేయవచ్చని (వారానికి కనీసం 150 నిమిషాలు లక్ష్యంగా పెట్టుకోండి) నిపుణులు చెబుతున్నారు.
after6weeks | ఇతర ముఖ్యమైన చిట్కాలు

ప్రసవం తర్వాత 6-12 నెలల్లో బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. మొదటి 6 వారాల్లో సగం బరువు తగ్గుతారు. హార్మోన్ల మార్పులు, నిద్రలేమి, ఒత్తిడి బరువు తగ్గడాన్ని ప్రభావితం చేస్తాయి, కాబట్టి ఓపిక అవసరం. ఏదైనా వ్యాయామం లేదా ఆహార ప్రణాళిక ప్రారంభించే ముందు వైద్యుడిని సంప్రదించాలి. ముఖ్యంగా థైరాయిడ్ సమస్యలు వంటివి ఉంటే ఈ చిట్కాలు(Tips) మీ బరువు తగ్గించే ప్రయాణంలో సహాయపడతాయి.. కానీ మీ శరీరాన్ని నయం చేసుకోవడానికి సమయం ఇవ్వడం చాలా ముఖ్యం.
after6weeks | పొట్ట దగ్గర కొవ్వు ఎలా తగ్గించుకోవాలి…

ముఖ్యంగా ప్రసవం తర్వాత మీ శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. అత్యంత సాధారణ ఆందోళనలలో ఒకటి బొడ్డు చుట్టూ పేరుకుపోయే కొవ్వు. ప్రసవం తర్వాత మీ నడుము చుట్టూ కొంత అదనపు బరువు ఉండటం పూర్తిగా సాధారణం, కానీ ఓపిక, సరైన విధానంతో మీరు క్రమంగా మీ గర్భధారణ(Pregnancy)కు ముందు ఆకారాన్ని తిరిగి పొందవచ్చు.
after6weeks | డెలివరీ తర్వాత పొట్ట దగ్గర కొవ్వు ఎందుకు ఉంటుంది?

గర్భధారణ సమయంలో మీ శరీరం శిశువును పోషించడానికి, తల్లి పాలివ్వడానికి సిద్ధం చేయడానికి కొవ్వును నిల్వ చేస్తుంది. ప్రసవం తర్వాత గర్భాశయం దాని అసలు పరిమాణానికి కుంచించుకుపోవడానికి సమయం పడుతుంది. విస్తరించిన ఉదర కండరాలు బలాన్ని తిరిగి పొందడానికి వారాలు లేదా నెలలు పట్టవచ్చు. హార్మోన్ల(Hormonal) మార్పులు, నిద్ర లేకపోవడం, ఒత్తిడి కూడా బరువు నిలుపుదలకు దోహదం చేస్తాయి.
మీ శరీరం కోలుకోవడానికి సమయం ఇవ్వడం ముఖ్యం. బరువు తగ్గడం లేదా వ్యాయామ దినచర్యను ప్రారంభించడానికి ముందు కనీసం 6-8 వారాల ప్రసవానంతరం వేచి ఉండాలని వైద్యులు సాధారణంగా సిఫార్సు చేస్తారు. మీకు సి-సెక్షన్(C-section) ఉంటే మీకు ఎక్కువ కోలుకునే సమయం అవసరం కావచ్చు.
(ఈ వ్యాసం పాఠకుల ప్రాధమిక అవగాహన కొరకు మాత్రమే అందించబడుతోంది. సరైన వైద్యుల పర్యవేక్షణలోనే బరువు తగ్గే ప్రయత్నం చేయాలి)
click here to read 500 millions | పేగు బ్యాక్టీరియాతో మధుమేహానికి చెక్!
