Andhra Prabha Calendar | పాఠకుల మదిలో ఆంధ్రప్రభకు సుస్థిర స్థానం…

Andhra Prabha Calendar | పాఠకుల మదిలో ఆంధ్రప్రభకు సుస్థిర స్థానం…
- ఆంధ్రప్రభ క్యాలెండర్ ను ఆవిష్కరించిన అధికారులు…
Andhra Prabha Calendar | వెల్గటూర్, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో స్థానిక తహశీల్దార్ ఆర్ శేఖర్, మండల పరిషత్ అధికారి వెంకట ప్రసాద్, మండల వ్యవసాయ అధికారి సాయి కిరణ్, ఎస్ఐ ఉదయ్ కుమార్ లు 2026 ఆంధ్రప్రభ క్యాలెండర్(Andhra Prabha Calendar) ను ఇవాళ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఆర్ శేఖర్ మాట్లాడుతూ… గత 87 సంవత్సరాలుగా లక్షలాది మంది పాఠకుల నుంచి విశేష ఆదరణ పొందడంతో పాటు ప్రజా సమస్యల పరిస్కారం(Problem Solving)లో కూడా “ఆంధ్రప్రభ”ముందు వరుసలో ఉందన్నారు.
అందువల్లే ఆంధ్రప్రభ పాఠకుల మదిలో సుస్థిర స్థానం పొందిందన్నారు. ఎన్నో సంవత్సరాలుగా సంచలనాత్మక కథనాలను ప్రచురిస్తూ సమగ్రంగా వార్తలను ప్రజలకు చేరవేయడంలో ఆంధ్రప్రభ ముందు వరుసలో ఉంటుందని, మండల అభివృద్ధి(Development) అధికారి వెంకటప్రసాద్ తో పాటు వ్యవసాయ అధికారి సాయి కిరణ్ అన్నారు.
అసలైన నిఖార్సయిన వార్తలతో సుదీర్ఘ కాలం రాణించడంలో ఆంధ్రప్రభ అద్భుతమన్నారు ఎస్ఐ ఉదయ్ కుమార్. ఈ సందర్భంగా ఆంధ్రప్రభ యాజమాన్యంతో పాటు మండల విలేకరి జూపాక కిరణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో.. ఆర్ఐ లు రాజేశ్వరి, రాం రెడ్డి, తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
