Vijay Devarakonda | పవర్ ఫుల్ రోల్ లో.. విజయ్

Vijay Devarakonda | పవర్ ఫుల్ రోల్ లో.. విజయ్
Vijay Devarakonda | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కెరీర్ ఆరంభంలో స్పీడు చూపించారు.. వరుసగా సక్సెస్ సాధించారు. అయితే.. పాన్ ఇండియా స్టార్ అవ్వాలని చేసిన ప్రయత్నాలు మాత్రం ఫలించలేదు. పాన్ ఇండియా (Pan India) రేంజ్ లో క్రేజ్ అయితే వచ్చింది కానీ.. సక్సెస్ మాత్రం రాలేదు. ఇప్పుడు రూటు మార్చి రౌడీ జనార్థన్ అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీ కోసం.. విజయ్ దేవరకొండ మాత్రమే కాదు.. నిర్మాత దిల్ రాజు కూడా రూటు మార్చారు. ఇంతకీ.. విజయ్, దిల్ రాజు రూటు మార్చి ఏం చేస్తున్నారు..? మరి.. ఈసారైనా ప్లాన్ ఫలించేనా..?

Vijay Devarakonda | సీరియస్ పాత్రలో విజయ్..
రౌడీ జనార్థన చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ (Dil Raju Sirish) నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రౌడీ జనార్థన సినిమా రూపొందుతోంది. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ను హైదరాబాద్ లో విజయ్ దేవరకొండ అభిమానుల కేరింతల మధ్య గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ రిలీజైనప్పటి నుంచి సినిమా పై మరింత క్రేజ్ పెరిగింది. అలాగే.. విజయ్ ఇంత సీరియస్ పాత్ర చేస్తున్నాడా..? దిల్ రాజు ఇంత రక్తపాతంతో సినిమా చేస్తున్నారా..? అనే డౌట్ అందరిలో ఏర్పడింది. ఇదే విషయం దిల్ రాజును అడిగితే.. ట్రెండ్ ను బట్టి సినిమా తీయాలి.. నేను మారిపోయాను అని చెప్పడం విశేషం.

Vijay Devarakonda | 80 దశకం బ్యాక్ డ్రాప్ లో..
రౌడీ జనార్థన సినిమాను ఎలా చూపించబోతున్నాం అనేది చిన్న స్టోరీ రివీల్ చేశాం. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) డిఫరెంట్ మూవీస్ చేస్తూ వచ్చాడు కానీ.. తొలిసారిగా ఈ మూవీలో ఆంధ్రలోని ఈస్ట్ గోదావరి యాసలో మాట్లాడిస్తున్నామని దిల్ రాజు చెప్పారు. విజయ్ ఈస్ట్ గోదావరి యాసలో మాట్లాడటం.. ఈ స్టోరీ విన్నప్పుడు యూనిక్ గా అనిపించిందని దిల్ రాజు చెప్పారు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి యూత్ ఫుల్ మూవీస్ చేశాడు కానీ.. ఇప్పటి వరకు ఇంత మాస్, బ్లడ్ షెడ్ ఉన్న క్యారెక్టర్ చేయలేదు. ఔట్ అండ్ ఔట్ మాస్ క్యారెక్టర్ లో విజయ్ కనిపించబోతున్నారు. 80 దశకం బ్యాక్ డ్రాప్ లోని వరల్డ్ ను ఈ సూపర్బ్ టెక్నీషియన్స్ అంతా క్రియేట్ చేశారు. రవి కిరణ్ విజన్ లోని కొత్తదనాన్ని తీసుకొచ్చేందుకు ఈ టీమ్ అంతా కష్టపడుతున్నారని చెప్పారు.

Vijay Devarakonda | పెద్ద బాధ్యతే..
రాజా వారు రాణి గారు.. అనే చిన్న సినిమా చేసి ఇండస్ట్రీని, ప్రేక్షకుల్ని తన వైపు తిప్పుకోగలిగాడు డైరెక్టర్ రవి కిరణ్.(Ravi kiran) రెండో సినిమాకు మంచి స్క్రిప్ట్ అందించాడు. ఇప్పుడు మూడో సినిమాకు రౌడీ జనార్థనతో పెద్ద బాధ్యత పెట్టుకున్నాడు. రవి కిరణ్ కోలాకు ఈ సినిమా పెద్ద బాధ్యతే. అయితే.. కథ పై ఎంతో కసరత్తు చేసి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. విజయ్ దేవరకొండ ఇటీవల చేసిన సినిమాలు అన్నీ ఫ్లాప్ అయ్యాయి. అలాగే దిల్ రాజు బ్యానర్ నుంచి ఈమధ్య కాలంలో వచ్చిన సినిమాలు ఎక్కువ ఫ్లాప్ అయ్యాయి. ఆయన సినిమాలు అంటే.. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లా ఉంటాయి. అయితే.. ఇప్పుడు సినిమాల్లో హింస ఎంత ఎక్కువ చూపిస్తే.. అంత పెద్ద హిట్ అవుతుంది. ఈ రూటులోనే దిల్ రాజు ఆలోచించి ఈ కథను ఓకే చేశారు. సక్సెస్ కోసం రూటు మార్చారు.. మరి.. విజయ్, దిల్ రాజు.. ప్లాన్ ఫలిస్తుందా..? ఆశించిన సక్సెస్ అందిస్తుందో లేదో చూడాలి.

