sriramsagar| యాసంగికి నీళ్లు

యాసంగికి నీళ్లు

నేటి నుంచి పంట‌ల‌కు నీటి విడుదల
ఎస్సారెస్పీ నుంచి వారబందీ ప్రకారం ప్రణాళిక ఖరారు
ఎనిమిది తడులకు 51.04 టీఎంసీల కేటాయింపు

sriramsagar| బాల్కొండ, ఆంధ్రప్రభ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి యాసంగి పంటలకు ఆయకట్టుకు నీటి విడుదల చేసేందుకు ప్రభుత్వం షెడ్యుల్ ఖరారు చేసింది. నేటి నుంచి కాలువల ద్వారా నీటిని విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ ఏడాది ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన భారీ వరదలతో రికార్డు స్థాయిలో వరద వచ్చిచేరింది. ప్రస్తుతం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ 80.5 టీఎంసీలతో నిండుకుండలా ఉంది. దీంతో ఎల్ఎండీ ఎగువన ఉన్న 6 లక్షల ఎకరాలకు, ఎల్ఎండీ దిగువన 3.6 లక్షల ఎకరాలు మొత్తం 9.6 లక్షల ఎకరాలకు వారంబందీ ప్రకారం నీటి విడుదల చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. వారబందీ ప్రకారం 7 రోజులు నీటి విడుదల 8 రోజులు నిలిపివేత ఉంటుందని ప్రాజెక్టు అధికారులు మంగళవారం తెలిపారు.

కాలువలకు నీటి కేటాయింపులు
కాకతీయ కాలువ ద్వారా 41.43 టీఎంసీలు, సరస్వతీ కాలువకు 3.39 టీఎంసీలు, లక్ష్మీ కాలువ ద్వారా 1.48 టీఎంసీలు, అలీసాగర్ ఎత్తిపోతలకు 2.29 టీఎంసీలు, గుత్ప ఎత్తిపోతలకు 1.14 టీఎంసీలు, ముంపు గ్రామాల లిఫ్టులకు మరో 1.32 టీఎంసీలు కేటాయించారు.ఇలా మొత్తం 51.04 టీఎంసీలను కేటాయించారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని ఎస్ఈ జగదీష్ సూచించారు.

Leave a Reply