క్యాన్సర్‌తో పోరాడుతున్న టీడీపీ కార్యకర్త ఆకుల కృష్ణ కోరికను ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి చెందిన కృష్ణ, పార్టీకి ప్రారంభం నుంచే విధేయుడు. ఇటీవల ఆయన ఆరోగ్యం విషమించడంతో, చంద్రబాబును ఒక్కసారైనా చూడాలని కోరిక వ్యక్తం చేశారు.
ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు శనివారం వీడియో కాల్ ద్వారా ఆయనతో మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ధైర్యంగా ఉండమని, అన్ని విధాలుగా పార్టీ తన వెన్నుగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
మాట్లాడే స్థితిలో లేని కృష్ణ, స్వయంగా చంద్రబాబు ఫోన్ చేసినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. “ఇప్పుడు ఎంతో సంతృప్తిగా ఉంది” అని భావోద్వేగంతో తెలిపారు.
