In AP Yogi Treat : పవనోత్తేజం… పోలీసు తాండవం Andhra Prabha News

In AP Yogi Treat : పవనోత్తేజం… పోలీసు తాండవం Andhra Prabha News

కదిరిలో రౌడీ దాష్టీకం

నిండు గర్భిణీపై దాడి

చలించిన పోలీసులు

నడివీధిలో నిందితుడి ఊరేగింపు

రౌడీల గుండెల్లో భారీ బీపీ

( శ్రీ సత్య సాయి బ్యూరో,  ఆంధ్రప్రభ):

రౌడీయిజాన్ని సహించం. గీతలు దాటొద్దు. హద్దు మీరితే అరచేతిలో గీతలు అరగదీస్తాం. ఏపీలో లక్షమంది పోలీసలు , వందలాది మంది ఎస్పీలు, 2000 మంది డీఎస్పీలు ఉన్నారు. కేవలం రెండు రోజుల్లో ..48 గంటల్లో రౌడీ గ్యాంగ్​ పని పట్టేస్తాం. యోగి ఆదిత్యనాథ్​ (In Ap Yogi Treat)  ట్రీట్​ మెంట్​ ఇస్తాం, అని డిప్యూటీ సీఎం పవన్​ కళ్యాణ్​ హెచ్చరికలతో (Dy.Cm Pawan worning) … పోలీసుల్లో చలనం వచ్చింది.

In AP Yogi Treat

రౌడీల పని పట్టే క్రతువులో బిజీబిజీ అయ్యారు. ఓ నిండు గర్భిణీపై దాడి చేసిన ఓ రౌడీని కదిరి పోలీసులు పట్టుకున్నారు. నడి వీధిలో (Street march)  ఊరేగించారు. అరాచకాలకు పాల్పడితే సహించేది లేదని, అటువంటి రౌడీలపై  పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని కదిరి డీఎస్పీ  శివన్నారాయణ (Kadiri DSP)  స్వామి హెచ్చరించారు.

In AP Yogi Treat

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం  తనకల్లు మండలం ముత్యాల వారి పల్లి గ్రామంలో ఆదివారం గర్భిణీ పై దాడి కేసులో నిందితుడిని (Acused Arrest)   మంగళవారం  అరెస్టు చేశారు.    కదిరి రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శివన్నారాయణ మాట్లాడారు. ఆయన తెలిపిన కేసు వివరాలు ఇలా ఉన్నాయి.

In AP Yogi Treat

శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం, ముత్యాలవారిపల్లి గ్రామంలో  పుప్పాల సత్యనారాయణ, అతని కుమారులు  ప్రేమ్ కుమార్, గిరీష్ బాబు ఉంటున్నారు. గిరీష్ బాబు భార్య (Sandhya Rani) సంధ్యా రాణి. సంధ్యారాణి ప్రస్తుతం (6 months pregnant)  ఆరు నెలల గర్భవతి.  21.12.2025 వ తేదీన మాజీ సీఎం  YS జగన్మోహన్ రెడ్డి  పుట్టిన రోజు కాగ,  ఆ రోజు రాత్రి సుమారు 7:30  గంటల సమయంలో  నిందితులు  పుష్పాల అజయ్ దేవ , అతని తండ్రి అంజినప్ప    కుటుంబ సభ్యులు జగన్​  పుట్టినరోజు వేడుక జరిపారు.

In AP Yogi Treat

తమ  ఇంటి ముందర సిమెంట్ రోడ్డు పైన కేక్ ను కోసి,  పెద్ద టపాసులు పేల్చారు.  అవి పేలి పెద్ద శబ్దం రావటంతో..గర్భిణీ సంధ్యారాణి కలవరపడింది. గర్భంలో శిశువు చలనంతో భయపడిపోయింది.  రోడ్డు మీదకు వచ్చి   ‘నేను గర్భవతిని ఇక్కడ టపాసులు పేల్చవద్దని” చెప్పింది. అందుకు నిందితులు  పుష్పాల అజయ్ దేవ, అంజినప్ప  ఇద్దరు కలిసి ‘రోడ్డు ఏమన్నా మీద, మీ నాయనదా’ అని సంధ్యారాణి ని నానా బూతులు Abuse Language) తిట్టారు (Cursed).  ‘రే వీళ్లది ఎక్కువైంది రా, వీళ్ళని చంపితే, అప్పుడు మనమేందో తెలుస్తుంది, దీన్ని చంపు రా’ అని అంజనప్ప  అరిచాడు.   

In AP Yogi Treat

వెంటనే పుష్పాల అజయ్ దేవ {Puppala Ajey Deva) రెచ్చిపోయాడు.  తన  ఇంటి కాంపౌండ్ లోని   కట్టె తీసుకుని వచ్చి సంధ్యారాణి ని (Hit with stick) కొట్టాడు. . ఆమె ప్రక్కకు వంగి తప్పించుకుంది. కానీ  పుష్పాల అజయ్ దేవ  తన చేతులతో సంధ్యారాణిని గొంతు పట్టుకుని గోడకు నెట్టి, ఆమె గర్భవతి అని తెలిసినా  కూడా, ఆమెను, ఆమె గర్భంలోని శిశువును చంపాలనే ఉద్దేశ్యంతో సంధ్యారాణి కడుపు మీద కాలితో బలంగా (Forcely Kicked)  తన్నాడు.

అంతలో  ఆమె కిందపడినది. పుష్పాల అజయ్ దేవ తన చేతిలో ఉన్న కట్టె ను తన ఇంటి ముందర రోడ్డు ప్రక్కన పడేసి తన తండ్రి అంజినప్పను  పిలుచుకుని  అక్కడి నుండి పారి పోయాడు. తీవ్ర వేదనతో సంధ్యారాణి ఆసుపత్రిలో చేరగా..  

In AP Yogi Treat

22-12-2025 వ  11.30 AM గంటలకు  పుప్పాల సంధ్యా రాణి  పిర్యాదు మేరకు తనకల్లు పోలిస్ స్టేషన్ లో  Cr. No.152/2025 U/s 109 (1) R/w 3(5) BNS గా కేసు నమోదు చేసి పోలీసులు  దర్యాప్తు ప్రారంభించారు.  23-.12-.2025 వ   ఉదయం 10.30 AM గంటలకు తనకల్లు మండలం NH-42 కదిరి-మదనపల్లి రోడ్డులో   BT క్రాస్ వద్ద  A-1 నిందితుడు  పుష్పాల అజయ్ దేవ ను   పోతాసుతు  అరెస్ట్ చేశారు. ఈ మీడియా సమావేశంలో డీఎస్పీ శివన్నారాయణ,   సీఐ నాగేంద్ర,  ఎస్ఐ గోపి  పాల్గొన్నారు.

Leave a Reply