MeditationHeartfullness : హార్ట్ ఫుల్ నెస్ మెడిటేషన్ Andhra Prabha NewsMeditation

Heartfullness : హార్ట్ ఫుల్ నెస్ మెడిటేషన్ Andhra Prabha News
ఏపీ సచివాలయంలో ఆఫీసర్లు ధ్యానం
కన్హా శాంతివనం క్రతువు సూపర్
( ఆంధ్రప్రభ, అమరావతి)

ఎపి సచివాలయంలో ఐఏఎస్ అధికారులు,ఇతర విభాగాల అధికారులు,సిబ్బందికి ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ (Innovative Practice) , ఇనీషియేటివ్స్ Initiatives) ,మెడిటేషన్ పై హైదరాబాదు రామచంద్ర మిషన్- కన్హా శాంతివనం –హార్ట్‌పుల్‌నెస్ (Heartfullness) ఇనిస్టిట్యూట్ ప్రతినిధి కమలేశ్ డి.పాటిల్ దాజీ (DAAJI) బృందం మంగళవారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.ఈశిక్షణా కార్యక్రమంలో మెడిటేషన్ (Meditation) ఇతర ప్రక్రియలు వల్ల కలిగే ప్రయోజనాలు వాటిని ఆచరించాల్సిన విధానాలపై ఆయన వివరించండంతో పాటు సుమారు అర్ధ గంటపాటు అధికారులతో మెడిటేషన్ చేయించారు.
Heartfullness

ధ్యానం ఇతర మూలచక్ర ప్రక్రియలు వాటి వల్ల కలిగే ప్రయోజనాలు గురుంచి వివరించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల హైదరాబాదులోని కన్హా శాంతివనాన్ని సందర్శించిన పిదప వారి విజ్ఞప్తి మేరకు ఇక్కడ ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆసంస్ధ నిర్వహకులు దాజీ పేర్కొన్నారు.
దైనందిన జీవితంలో ఐఏఎస్ అధికారులు (IAS Oficers) సహా ఇతర అధికారులు,సిబ్బంది వారు విధి నిర్వహణలో ఎదుర్కొనే మానసిక (Mental) ,శారీరక ఒత్తుడుల (Physical) నుండి ఉప శమనం కలిగించేందుకు ధ్యానం ఎంతగానో దోహదపడుతుంది.అంతేగాక ప్రతి నిత్యం ధ్యానం (Meditation ) ,యోగా (Yoga) వంటివి ఆచరించడం ద్వారా మానసిక,శారీక ఒత్తులను అధికమించి విధి నిర్వహణలో మరింత చురుగ్గా వేగవతంగా పని చేసేందుకు యోగా,ధ్యానం వంటి ప్రక్రియలు అన్ని విధాలా ఉపయోగపడతాయి.
Heartfullness

రామచంద్ర మిషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆసక్తిగల అన్వేషకులకు ఆధ్యాత్మిక శిక్షణను అందించే లాభాపేక్షలేని సంస్థ.సహజ్ మార్గ్ వ్యవస్థలో మూలాలను కలిగి ఉన్న హార్ట్ఫుల్నెస్ ధ్యానం ద్వారా ఇది హృదయ ఆధారిత మార్గంలో సమతుల్య జీవనానికి ఒక మార్గాన్ని అందిస్తుంది. కన్హా శాంతి వనంను హార్ట్ ఫుల్ నెస్ అంతర్జాతీయ ప్రధాన కార్యాలయంగా స్థాపించారు. హార్ట్ ఫుల్ నెస్ యోగా అకాడమీ, ట్రీ కన్జర్వేషన్ సెంటర్ మరియు వెల్నెస్ సెంటర్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
Heartfullness

ప్రభుత్వాలు రైతుల సహకారంతో ఆయన చేపట్టిన హరిత కార్యక్రమాలు కన్హాను 800,000 చెట్లు అరుదైన జాతులకు నిలయంగా మార్చాయి.ఈకేంద్రంలో ధ్యాన తరగతులు,ఆన్లైన్ & ఆఫ్‌లైన్ సెషన్లు,మెడిటేషన్ వర్క్‌షాప్‌లు వంటివి నిర్వహిస్తుంటారు.కొత్త అభ్యాసుల కోసం హార్ట్ఫుల్నెస్ ధ్యానాన్ని పరిచయం చేయడానికి ఉద్దేశించబడింది.దీనిలో ధ్యానం,యోగా, కమ్యూనిటీ శిబిరం, ఖాళీ కాలం ఆలోచన కోసం వంటి సెషన్లు ఉంటాయి. ఈకార్యక్రమంలో పలువురు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు,ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, శాఖాధిపతులు,ఇతర అధికారులు పాల్గొన్నారు.
