- ముగ్గురికి గాయాలు
వెల్దుర్తి, (ఆంధ్రప్రభ) : వెల్దుర్తి సమీపంలోని జాతీయ రహదారి–44పై హనుమాన్ సర్కిల్ వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అలంపూర్ చౌరస్తా నుండి బెంగళూరుకు మిరప లోడుతో వెళ్తున్న బొలెరో క్యాంపర్ వాహనాన్ని, వెనుక నుంచి వేగంగా వస్తున్న టయోటా గ్లాంజా కారు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు తీవ్రంగా వ్యక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిని హైవే అంబులెన్స్ ద్వారా కర్నూలు జీజీహెచ్‌కు తరలించారు. సమాచారం అందుకున్న హైవే మొబైల్–2 సిబ్బంది తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం కారణంగా రహదారిపై ట్రాఫిక్ కొన్ని నిమిషాలపాటు అంతరాయం కలిగింది.

