Mega Fans | రికార్డుల వేట…

Mega Fans | రికార్డుల వేట…

Mega Fans | మెగా ఫ్యాన్స్ కు 2025.. ఫరవాలేదు అనిపించింది కానీ.. వావ్ అనిపించేలా పూర్తి స్థాయిలో కిక్ ఇవ్వలేదు. అందుకనే మెగా ఫ్యాన్స్ 2026(Mega Fans 2026) ఎప్పుడు వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ ఇయర్ మెగా అభిమానులకు చాలా స్పెషల్ అని చెప్పచ్చు. ఎందుకు అనుకుంటున్నారా… అయితే.. ఇంకెందుకు ఆలస్యం.. ఇది చదవండి మీకే తెలుస్తుంది..

Mega Fans | నిరాశపరిచిన గేమ్ ఛేంజర్..

Mega Fans

2025లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. సరే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ గేమ్ ఛేంజర్ సినిమా అయినా బ్లాక్ బస్టర్ సాధిస్తుందని మెగా అభిమానులు(fans) ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే.. ఆ ఆశలన్నీ నిరాశ అయ్యాయి కానీ.. బ్లాక్ బస్టర్ రాలేదు. యావరేజ్ గా అయినా నిలుస్తుంది అనుకుంటే.. బాక్సాఫీస్ దగ్గర గేమ్ ఛేంజర్ డిజాస్టర్(Game Changer Disaster) అయ్యింది. ఇక పవర్ స్టార్ నుంచి రెండు సినిమాలు వచ్చాయి.. అందులో వీరమల్లు ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. ఓజీ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ సాధించిన మెగా అండ్ పవర్ స్టార్ ఫ్యాన్స్ కు మాంచి కిక్ ఇచ్చిందని చెప్పచ్చు.

Mega Fans | మన శంకర్ వరప్రసాద్ గారు.. వస్తున్నారు..

Mega Fans

2026లో ముందుగా మెగాస్టార్ చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ గారు అంటూ వస్తున్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్(Successful Director) అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చిరుకు జంటగా అందాల తార నయనతార నటిస్తుంది. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన రెండు పాటలకు అనూహ్య స్పందన వచ్చింది. ఇందులో విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) నటిస్తుండడం.. అది కూడా గెస్ట్ రోల్ లా.. అలా కనిపించి ఇలా వెళ్లిపోవడం కాకుండా.. ఓ ఇరవై నిమిషాల పాటు కనిపించబోతుండడంతో ఈ సినిమా పై మరింత క్రేజ్ పెరిగింది. సంక్రాంతికి జనవరి 12న ఈ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి ఇప్పటి వరకు అపజయం అనేది లేకుండా వరుసగా సక్సెస్ సాధిస్తుండడంతో ఇది పక్కా బ్లాక్ బస్టర్(Blockbuster) అనే టాక్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. దీంతో మెగా అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.

Mega Fans | అంచనాలు పెంచేసిన పెద్ది..

Mega Fans


మెగా అభిమానులు ఎదురు చూస్తున్న మరో మూవీ పెద్ది(Another movie is Peddi). గేమ్ ఛేంజర్ మూవీతో నిరాశపరచడంతో.. ఈసారి పక్కా బ్లాక్ బస్టర్ సాధించాలని రామ్ చరణ్‌ ఎంతో కసితో చేస్తున్న మూవీ ఇది. ఈ సినిమాని ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నారు. ఈ భారీ పాన్ ఇండియా మూవీకి సంగీత సంచలనం ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్(AR Rahman Music) అందిస్తున్నారు. ఆల్రెడీ రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ వైరల్ అయ్యింది.. ట్రెండింగ్ లో నిలిచింది. దీంతో పెద్ది పై మరింత బజ్ క్రియేట్ అయ్యింది. చరణ్ కు జంటగా అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ భారీ పాన్ ఇండియా మూవీని మార్చి 27న రిలీజ్(Release on the 27th) చేయనున్నారు.

Mega Fans | ఉస్తాద్ రెడీ..

Mega Fans

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ కొత్త సంవత్సరంలో.. ఉస్తాద్ భగత్ సింగ్(Ustad Bhagat Singh) అంటూ రాబోతున్నారు. హరీష్ శంకర్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. పవన్, హరీష్.. ఈ క్రేజీ కాంబోలో గబ్బర్ సింగ్ మూవీ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ అయితే.. యూట్యూబ్(YouTube) ని షేక్ చేస్తుంది. సరికొత్త రికార్డులు సాధిస్తూ దూసుకెళుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ.. పవర్ స్టార్ పొలిటికల్ గా బిజీగా ఉండడం వలన లేట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్(Post-production work) జరుపుకుంటుంది. ఈ క్రేజీ మూవీని సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు.

Mega Fans | ఐకాన్ స్టార్.. పాన్ వరల్డ్ మూవీ..

Mega Fans

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప, పుష్ప 2 అంటూ పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్(Create a sensation) చేశారు. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో పాన్ వరల్డ్(Pan World) మూవీ చేస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని కోలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. దాదాపుగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకునే నటిస్తుంది. మృణాల్ ఠాగూర్(Mrinal Tagore) నటిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది కానీ.. మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. ఈ సినిమా చాలా ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ క్రేజీ మూవీని 2026 లోనే భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది.

Mega Fans | ఈసారి గురి తప్పేదేలే..

Mega Fans

సాయిధరమ్ తేజ్ నటిస్తున్న సంబరాల ఏటిగట్టు, వరుణ్‌ తేజ్, మేర్లపాక గాంధీతో చేస్తున్న మూవీ కూడా 2026లోనే రాబోతున్నాయి. అలాగే ఉప్పెన మూవీతో బ్లాక్ బస్టర్(Blockbuster with a movie) సాధించి ఆతర్వాత సరైన సక్సెస్ లేక గ్యాప్ తీసుకున్న వైష్ణవ్ తేజ్ కూడా కొత్త సంవత్సరంలోనే కొత్త సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు. ఈసారి గురి తప్పేదేలే అన్నట్టుగా సక్సెస్ సాధించాలని పట్టుదలతో సినిమాలు చేస్తున్నారు. ఇలా.. 2026లో మెగా హీరోలు బాక్సాఫీస్ పై దండయాత్ర(Box office raid) చేయడానికి రాబోతున్నారు. ఇది మెగా అభిమానులకు పండగే అని చెప్పచ్చు. మరి.. మెగా హీరోలు ఈ సినిమాలతో ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో.. ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తారో చూడాలి.

CLICK HERE TO READ కళ్యాణ్ పడాల కి బిగ్ బాస్ ట్రోఫీ

CLICK HERE TO READ MORE

Leave a Reply