High Command | ముగ్గురు కాంగ్రెస్ నాయకులపై వేటు

High Command | ముగ్గురు కాంగ్రెస్ నాయకులపై వేటు
High Command | నర్సింహులపేట, ఆంధ్రప్రభ : మండలంలోని రెండు గ్రామాలకు చెందిన ముగ్గురు మండల స్థాయి కాంగ్రెస్ నాయకులను పార్టీ నుంచి బహిష్కరించామని, గ్రామ శాఖ అధ్యక్షుడిని అధ్యక్ష పదవి నుంచి మూడు నెలల పాటు తొలగిస్తూ క్రమశిక్షణ(discipline) చర్యలు తీసుకుంటున్నట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జినుకల రమేష్ అన్నారు.
ఈ రోజు మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తల విన్నపంతో జిల్లా పార్టీ హైకమాండ్(High Command) ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. రామన్నగూడెం గ్రామానికి చెందిన కొండ్రెడ్డి రణధీర్ రెడ్డి, నర్సింహులపేటకు చెందిన పోలేపల్లి రజనీకాంత్ రెడ్డి, ఎర్ర లచ్చయ్య గూడెం(బంజర) గ్రామానికి చెందిన వెన్నం రవీందర్ రెడ్డిలను బహిష్కరించినట్లు తెలిపారు.
అలాగే గ్రామ శాఖ అధ్యక్షుడు కడుదుల రామకృష్ణపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా మూడు నెలల పాటు అధ్యక్ష పదవిని తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొబ్బ సోమిరెడ్డి, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు దఫ్రునాయక్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహబూబ్ ఖాన్, యువజన నాయకుడు చిర్ర సతీష్(Chirra Satish), నాయకులు అల్వాల శ్రీనివాస్, వివిధ గ్రామాల నూతన సర్పంచులు, ఉప సర్పంచులు, గ్రామశాఖ అధ్యక్షులు,పార్టీ శ్రేణులు తదితరులు ఉన్నారు.
కాగా…. పార్టీ నుంచి బహిష్కరించినట్లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే గ్రామ శాఖ అధ్యక్షుడు కడుదుల రామకృష్ణ, వెన్నం రవీందర్ రెడ్డి, మరిపెడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన నూతన సర్పంచుల సన్మాన సభ వేదిక వద్ద ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ పక్కన కనిపించడం విశేషం.
