Sonia Gandhi | మోడీ స‌ర్కార్ పై సోనియా గాంధీ ఫైర్

Sonia Gandhi | మోడీ స‌ర్కార్ పై సోనియా గాంధీ ఫైర్

Sonia Gandhi | ఢిల్లీ, ఆంధ్ర‌ప్ర‌భ : ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ (MGNREGA) ను కేంద్ర ప్రభుత్వం నాశనం చేస్తోందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi) మండిపడ్డారు. ఉపాధి హామీ పథకం(Employment Guarantee Scheme) పేరు మార్పుపై స్పందించారు. ఈ మేరకు ఇవాళ ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ రూపురేఖలనే ప్రభుత్వం మార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లమంది రైతులు, కూలీల ప్రయోజనాలను దెబ్బతీశారన్నారు.

20 ఏళ్ల క్రితం మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఈ చట్టాన్ని తీసుకొచ్చాం.. లక్షలాది గ్రామీణ కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే విప్లవాత్మక చర్య.. పేదలకు జీవనాధారంగా ఉపాధి హామీ పథకం ఉంది.. గత 11 ఏళ్లుగా ఈ పథకాన్ని నీరుగార్చేలా మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.. కోవిడ్ వంటి సంక్షోభ సమయంలోనూ పేదలకు ఇది జీవనాధారంగా మారిందని సోనియా గాంధీ (Sonia Gandhi) పేర్కొన్నారు. గ్రామీణ పేదలను మోడీ ప్రభుత్వం విస్మరిస్తోందని సీరియస్ అయ్యారు. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ స్థానంలో కేంద్రం నల్లచట్టం తెచ్చేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఆ నల్లచట్టంపై పోరాటం చేసేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని సోనియా గాంధీ పిలుపునిచ్చారు.

Leave a Reply