కేంద్రం చెప్పింది ఇదే..

కేంద్రం చెప్పింది ఇదే..

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరాపై నెలకొన్న ఆందోళనల మధ్య కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దేశంలో ఎక్కడా ఎల్పీజీ కొరత లేదని కేంద్రం స్పష్టం చేసింది. గృహ వినియోగ గ్యాస్ సరఫరా సాధారణంగానే కొనసాగుతోందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో కొంతమంది ప్రాంతాల్లో డెలివరీ ఆలస్యం కావొచ్చని, అయితే సరఫరా వ్యవస్థ పూర్తిగా సజావుగానే పనిచేస్తోందని పేర్కొన్నారు.

ప్రత్యేకంగా 5 కిలోల చిన్న సిలిండర్లు కూడా అందుబాటులోనే ఉన్నాయని, అవసరమైన ప్రాంతాలకు సరఫరాను పెంచుతున్నట్లు కేంద్రం తెలిపింది. తక్కువ ఆదాయం గల వర్గాల కోసం ఈ సిలిండర్ల సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా గ్యాస్ సరఫరా గొలుసుపై ఒత్తిడి ఉన్నప్పటికీ, దేశీయ అవసరాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని కేంద్రం హామీ ఇచ్చింది. ఇక ప్రజలు అవసరానికి మించి బుకింగ్స్ చేయకుండా ఉండాలని, పానిక్ కొనుగోళ్లకు దూరంగా ఉండాలని కేంద్రం సూచించింది.

Leave a Reply