Bigg boss-9 | Chief Guest | రేపే ఫినాలే!… అందరి దృష్టి చీఫ్‌గెస్ట్‌పైనే!

Bigg boss-9 | Chief Guest | రేపే ఫినాలే!… అందరి దృష్టి చీఫ్‌గెస్ట్‌పైనే!
Bigg boss-9 | Chief Guest | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : బిగ్ బాస్ ముగింపునకు వచ్చేసింది… ఆదివారం ఫినాలే ఉంది.. అందరి దృష్టి చీఫ్ గెస్ట్‌పైనే ఉంది. బిగ్‌బాస్ – 9 సీజన్ పినాలేకి(Bigg Boss – Season 9 Finale) చీఫ్ గెస్ట్ తోపాటు ఎవరు వస్తారన్నది ఒక పెద్ద చర్చ సాగుతుంది. సంక్రాంతి ముందు జరిగే ఈ పెద్ద ఈవెంట్‌కు ఎవరెవెరు వస్తారన్నది కూడా ప్రేక్షకుల్లో(In the audience) ఉత్కంఠ చోటు చేసుకుంది.
Bigg boss-9 | Chief Guest | ఏవీల ప్రసారం…

బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ ఫినాలేకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఈ వారం రోజులపాటు పెద్దగా టాస్క్‌లు లేకుండా సింపుల్ టాస్క్‌లు(Simple tasks) ఇస్తూ ఏవీలు చూపడానికి బిగ్ బాస్ ప్రాధాన్యత ఇచ్చారు. ఒక వైపు టాప్ -5కి చేరుకున్న ఐదుగురు ఏవీ చూపించారు. వరుసక్రమంలో(In sequence) ఇమ్మానుయేల్, డీమాన్ పవన్, తనూజ పుట్టుస్వామి, కళ్యాణ్ పడాల, సంజనా ఏవీలను ప్రేక్షకులకు చూపించారు. అటు ఇంటి సభ్యులు, ఇటు ప్రేక్షకులను గ్రాండ్ ఫినాలేకి సిద్ధం చేశారు.
Bigg boss-9 | Chief Guest | చీఫ్ గెస్ట్‌గా చిరంజీవి..!

గతంలో గ్రాండ్ ఫినాలేకి అల్లు అర్జున్ వస్తారని బాగా ప్రచారం జరిగింది. కానీ పుష్ప-2 సినిమా రిలీజ్ సమయంలో జరిగిన దుర్ఘటనలతో ఆయన ఫినాలేకు హాజరు(Attend the finale) కాలేకపోయారన్న చర్చ జరిగింది. ఈ సారి మెగస్టార్ చిరంజీవి వస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కి , గ్రాండ్ ఫినాలే కి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి వస్తున్నారని బిగ్ బాస్ ధ్రువీకరించింది. అలాగే చిరంజీవితోపాటు సినీ హీరోలు రామ్‌చరణ్, ప్రభాస్ కూడా హాజరు కావచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పెద్ద కార్యక్రమానికి చిరంజీవి హోస్ట్(Chiranjeevi Host) నాగార్జునతో కలిసి వేదికను అలంకరించనున్నారు. సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని మూవి టీమ్ కూడా బిగ్‌బాస్ హోజ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. బహుశ ఈ రోజు ఎపిసోడ్‌లో శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty in the episode) కనిపంచే అవకాశాలు ఉన్నాయి. టాప్ – 5లో ఉన్న బిగ్ బాస్ కుటుంబ సభ్యులకు ఆఫర్ ఇవ్వడానికి టాస్క్‌లను శ్రీముఖి, ప్రదీప్ మాచిరాజు నిర్వహిస్తారు. ఈ ఎపిసోడ్ రేపు ప్రసారమవుతుందని సమాచారం.
Bigg boss-9 | Chief Guest | తొమ్మిది సీజన్‌లు బిగ్‌బాస్ విజేతలు వీరే…
- సీజన్ 1 – 2017 లో శివ బాలాజీ విన్నర్, ఆదర్శ్ బాలకృష్ణ రన్నర్
- సీజన్ 2 – 2018లో కౌశల్ మంద విన్నర్, గీతా మాధురి రన్నర్
- సీజన్ 3 – 2019లో రాహుల్ సిప్లిగంజ్ విన్నర్, శ్రీముఖి రన్నర్
- సీజన్ 4 – 2020లో అభిజీత్ దుద్దాల విన్నర్, అఖిల్ సార్థక్ రన్నర్
- సీజన్ 5 – 2021లో విజే సన్నీ విన్నర్, షణ్ముఖ్ జస్వంత్ రన్నర్
- సీజన్ 6 – 2022లో ఎల్.వి. రేవంత్ విన్నర్, శ్రీహన్ రన్నర్
- సీజన్ 7 – 2023లో పల్లవి ప్రశాంత్ విన్నర్, అమర్‌దీప్ చౌదరి రన్నర్
- సీజన్ 8 – 2024లో నిఖిల్ మలియక్కల్ విన్నర్, గౌతమ్ కృష్ణ రన్నర్
Bigg boss-9 | Chief Guest | ఆ ఇద్దరే…

బిగ్‌బాస్ సీజన్ -9లో విన్నర్, రన్నర్ ఆ ఇద్దరే అనేది ఇప్పటికే ప్రేక్షకులు ఒక నిర్ణయానికి వచ్చేశారు. విజేతగా కళ్యాణ్ పడాల నిలిచాడని సమాచారం. విన్నర్(winner)గా పోటీపడిన తనూజ పుట్టుస్వామి రన్నర్‌గా సరిపెట్టుకోవలసి వచ్చిందని సమాచారం. అయితే వీరిద్దరిలో ఎవరు విన్నర్, ఎవరు రన్నర్ అనేది ఆదివారం హోస్ట్ నాగార్జున(Host Nagarjuna) తేలుస్తారు. అంతవరకు ప్రేక్షకులకు ఉత్కంఠ తప్పదు.
Bigg boss-9 | Chief Guest | బిగ్ బాస్ -9 సీజన్‌లో ఎలిమినేట్ అయిన సభ్యులు వివరాలు ఇలా ఉన్నాయి…
1వ వరంలో శ్రాస్తి వర్మ
2వ వారంలో మనీష్ మర్యాద
3వ వారంలో ప్రియా శెట్టి
4వ వారంలో హరిత హరీష్
5వ వారంలో ఫ్లోరా సైనీ, శ్రీజ దమ్ము
6వ వారంలో భరణి శంకర్
7వ వారంలో రమ్య మోక్షం
8వ వారంలో మాధురి దువ్వాడ
9వ వారంలో శ్రీనివాస్ సాయి
10వ వారంలో నిఖిల్ నాయర్ మరియు గౌరవ్ గుప్తా ఇద్దరూ
11వ వారంలో ఎలిమినేషన్ లేదు
12వ వారంలో దివ్య నిఖిత
13వ వారంలో రీతు చౌదరి
14వ వారంలో సుమన్ శెట్టి , భరణి శంకర్
