Air India | తప్పిన పెను ప్రమాదం..

Air India | తప్పిన పెను ప్రమాదం..
Air India, గన్నవరం, ఆంధ్రప్రభ : గన్నవరం విమానాశ్రయంలో టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో తలెత్తిన సాంకేతిక లోపంతో ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపంతో రన్వైఫై ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం నిలిచిపోయింది. విమానంలో మొత్తం 175 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, మంత్రి అచ్చం నాయుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, బొత్స సత్యనారాయణ ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఈ విమానం క్యాన్సల్ అవ్వడంతో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఉంగుటూరు మండలం ఆత్మకూరు స్వర్ణ భారతి ట్రస్ట్ కు వెళ్లారు.
