Christmas | టీఎస్ఆర్ ఆహ్వానం..

Christmas | టీఎస్ఆర్ ఆహ్వానం..
Christmas, కోడూరు, ఆంధ్ర ప్రభ : టీఎస్ఆర్ గ్రూప్ చైర్మన్, టీఎస్ఆర్ మినిస్ట్రీస్ అధినేత తిరుపతి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈనెల 25వ తేదీన కోడూరులోని ఐదవ వార్డులో జరుగుతున్న 17వ మెగా గ్రాండ్ క్రిస్మస్ వేడుకలకు అవనిగడ్డ శాసనసభ్యులు, శాసనసభ ఎథిక్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ మండలి బుద్ధప్రసాద్, యువ నేత మండలి వెంకట్రామ్ లను తిరుపతి శ్రీనివాసరావు ఆహ్వానించారు.
గురువారం అవనిగడ్డలోని మండలి బుద్ధ ప్రసాద్ కార్యాలయంలో ఆయనను తిరుపతి శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలుసుకొని ఈనెల 25వ తేదీన కోడూరులో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనాలని ఆహ్వాన పత్రాలను అందజేశారు. 17వ గ్రాండ్ క్రిస్మస్ సందర్భంగా 17,000 మందికి ఆత్మీయ విందు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గ్రాండ్ క్రిస్మస్ కార్యక్రమంలో చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాదుకు తిరుపతి శ్రీనివాసరావు వివరించారు.
