Parliament | పార్లమెంట్‌లో బ‌ర్త్‌డే

Parliament | పార్లమెంట్‌లో బ‌ర్త్‌డే

  • కేక్ క‌ట్ చేసిన రామ్మోహన్ నాయుడు

Parliament | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : హస్తినలో రామ్మోహన్ నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పార్లమెంట్(Parliament) శీతాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు బ‌ర్త్‌డే వేడుక కూటమి ఎంపీల ఆధ్వర్యంలో జరిగాయి.

సహచర ఎంపీల సమక్షంలో రామ్మోహన్ నాయుడు కేక్‌ కట్ చేశారు. అనంత‌రం ఆయ‌న‌కు ఎంపీలు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. పౌర విమానయాన శాఖ(Civil Aviation Department) మంత్రిగా మంచి పనితీరు కనబరుస్తున్న రామ్మోహన్ నాయుడు.. మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.