Pediatric Pedlers | శిశువుల విక్రయ ముఠా అరెస్ట్

Pediatric Pedlers | శిశువుల విక్రయ ముఠా అరెస్ట్

ఏకకాలంలో దాడులు – పది మంది అరెస్ట్…
ఐదుగురు పిల్లలు రక్షణ కల్పించిన పోలీసులు….
డిల్లీ ముంబాయి లింక్
ముఠా సూత్రధారి పాత నేరజానే

Pediatric Pedlers | ఆంధ్రప్రభ, విజయవాడ (క్రైమ్) : విజయవాడ నగరంలో పిల్లలను విక్రయిస్తున్న ముఠా (Pediatric Pedlers) పై పోలీసులు ఏకకాలంలో రెండు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి పది మందిని అరెస్ట్ (arrest) చేశారు. ఈ దాడుల్లో అమ్మకానికి ఉంచిన ఐదుగురు చిన్నారులను రక్షించడంతో పాటు మూడు లక్షల ముప్పై వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో విజయవాడ సితార సెంటర్ కు చెందిన బగళం సరోజినీ అలియాస్ బలగం సరోజినీ (Sarojini) ప్రధాన నిందితురాలిగా గుర్తించారు. ఆమెతో పాటు గరికముక్కు విజయలక్ష్మి, వాడపల్లి బ్లేస్సి, ముక్తిపేట నందినీ, షేక్ బాబా వలి, ఆమదాల మణి, షేక్ ఫరీనా, ఐరి వంశీ కిరణ్ కుమార్, శంక యోహాన్, పతి శ్రీనివాసరావు లను అరెస్ట్ చేశారు.

టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతాకుమారి, పశ్చిమ ఏసీపీ ఎన్ వి దుర్గారావు, నార్త్ ఏసీపీ స్రవంతి రాయ్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ (Task Force), భవానిపురం, నున్న పోలీస్ స్టేషన్ల ఇన్స్పెక్టర్లు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. విచారణలో సరోజినీ డిల్లీ, ముంబాయి ప్రాంతాల నుండి పిల్లలను అక్రమంగా తీసుకువచ్చి, పిల్లలు లేని దంపతులకు నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలకు విక్రయిస్తున్నట్టు తేలింది. గతంలో ఆమెపై హైదరాబాద్ (Hyderabad), విజయవాడ ప్రాంతాల్లో పలు కేసులు నమోదై ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ నిందితులపై భవానిపురం, నున్న, కొత్తపేట పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసి బాలల సంరక్షణ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితులపై నిర్బంధ చట్టం కింద కూడా చర్యలు తీసుకుని జైలుకు పంపనున్నట్టు వెల్లడించారు.