12760 Panchayats | కాంగ్రెస్ లోకల్!

12760 Panchayats | కాంగ్రెస్ లోకల్!
- మొత్తం పంచాయతీలు 12760
- ఎన్నికలు జరిగిన పంచాయతీలు 12,705
- కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచిన పంచాయతీలు 7010
- విజయం శాతం 55.17 శాతం
12760 Panchayats | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : సాధారణంగా స్థానిక సంస్థ ఎన్నికల్లో అధికార పార్టీకి మద్దతు ఎక్కువగా లభిస్తుంది. అందుకు అనేక కారణాలు ఉంటాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో(elections) అధికార పార్టీకే పట్టం కట్టాలని ఎక్కువ మంది నిర్ణయించుకుంటారు. వీటితోపాటు ప్రభుత్వ పనితీరు, ప్రభుత్వం అమలు చేసే పథకాలు, స్థానిక నాయకుల ప్రభావం, అభ్యర్థి లక్షణాలు ఇలా ఎన్నో కారణాలు తీసుకుంటారు. కారణాలు ఏవైనా కాంగ్రెస్ మాత్రం పంచాయతీ ఎన్నికల్లో దూకుడుగా ముందుకు వెళ్లింది.
55.17 శాతం పంచాయతీలు కాంగ్రెస్‌కు దక్కాయి..
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం పంచాయతీలు 12760(Panchayats 12760) ఉన్నాయి. ఇందులో పలు కారణాలతో 12,705 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో కాంగ్రెస్ మద్దతుదారులు 7010 పంచాయతీల్లో విజయం సాధించారు. అంటే 55.17 శాతం పంచాయతీలు కాంగ్రెస్‌కు దక్కాయి. ఎక్కువ సీట్లు సాధించామని కాంగ్రెస్ సంబర పడుతుంది. స్వంతంత్ర అభ్యర్థులు అనేక మంది కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు ఉన్నారు. రెబల్ అభ్యర్థుల(1000 rebel candidates)తోపాటు మరికొందరు స్వతంత్ర అభ్యర్థులు కూడా కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఎందుకంటే అధికార పార్టీ వైపే ఉంటే నిధులు తెచ్చుకునే అవకాశం ఉంది. అలాగే రానున్న మండల పరిషత్ ఎన్నికల్లో సర్పంచ్‌లు కూడా కీలకం. అందుకే వీలైనంత ఎక్కువ మంది సర్పంచ్‌లను కాంగ్రెస్‌లోకి చేరేలా స్థానిక నాయకత్వం, ఎమ్మెల్యేలు కూడా ప్రయత్నాలు చేస్తారు. ఈ రకంగా చూసుకుంటే మరో ఏడు, ఎనిమిది శాతం పంచాయతీలు కాంగ్రెస్ గూటిలోకి వస్తాయి. అరవై నాలుగు శాతం పంచాయతీలు కాంగ్రెస్ పంచన ఉంటాయి.
తెలంగాణలో భిన్న రాజకీయాలు..
దేశంలోని ఇతర రాష్ట్ర రాజకీయాలు కంటే తెలంగాణలో భిన్న పరిస్థితులు ఉన్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ రెండు ప్రధాన పార్టీలతో ఎదుర్కొంటోంది. ఇక్కడ పదేళ్లు పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఎదుర్కొన్ని రాజకీయాలు(Politics) చేయాల్సిన పరిస్థితి ఇక్కడ కాంగ్రెస్‌కు ఉంది.
ఒక వైపు తెలంగాణ పోరాట వీరుడు, బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్షనేత కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఆధ్వర్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత(Senior leader) హరీశ్‌రావు రాజకీయంగా పావులు కదుపుతూ ప్రభుత్వ ప్రతి కదిలికను ఎండగడుతున్నారు. అలాగే బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కుమార్ కూడా ప్రభుత్వ కదిలికలను గమనించి గట్టిగా నిలదీస్తున్నారు. వాటిని కాంగ్రెస్ ఎదుర్కొంటూ అధిక పంచాయతీలు కైవాసం చేసుకోవడం ఆ పార్టీ శ్రేణులకు సంతోషాన్ని ఇచ్చింది.
