
MLA | భువనగిరిలో కదంతొక్కిన కాంగ్రెస్
MLA | భువనగిరిలో కదంతొక్కిన కాంగ్రెస్
- బీజేపీదీ నిరంకుశ పాలనపై ఆగ్రహం
- బీర్ల ఐలయ్య అరెస్టు
MLA | యాదాద్రి, ఆంధ్రప్రభ, ప్రతినిధి : బీజేపీ ప్రభుత్వం నిరంకుశ పాలన కొనసాగిస్తుందని ఆరోపిస్తూ భువనగిరి పట్టణంలో ఈ రోజు కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టారు. ప్రిన్స్ కార్నర్(Prince’s Corner) వద్ద డీసీసీ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య(MLA Beerla Ailaiah) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. బీజేపీ కార్యాలయం ముట్టడి చేసే సందర్భంలో డీసీసీ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్యను, కాంగ్రెస్ పార్టీ శ్రేణులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.



