TG Bjp | ఇలా అయితే కమల వికాసమెలా

TG Bjp | ఇలా అయితే కమల వికాసమెలా


ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ ఎంపీలతో నిర్వహించిన సమీక్ష సంచలనమైంది. బీజేపీలో (BJP) లుకలుకలు ఆ సమీక్షలో స్వయంగా ప్రధాని నోట వెలుగు చూశాయి. దానిపై చర్చ జరుగుతోంది… వరుస ఓటములతో కుదేలవుతున్న పార్టీకి కాయకల్ప చికిత్స చేయాల్సిన అవసరాన్ని ప్రధాని వ్యాఖ్యలు రుజువు చేస్తున్నాయి… అయితే దేశమంతటా వికసిస్తున్న కమలం పార్టీ.. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం విలపించడానికి
కారణాలేమిటి? అన్వేషించి.. ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. సబ్ కా సాత్ – సబ్ కా వికాస్ – సబ్ కా విశ్వాస్ ఎజెండాతో జాతీయ స్థాయిలో ముందుకు సాగుతున్న బీజేపీ తెలంగాణలో (Telangana) మాత్రం పట్టు సాధించలేక పోవడానికి సవాలక్ష కారణాలు ఉన్నాయని సాక్షాత్తూ ఆ పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. తిలాపాపం తలా పిడికెడు అన్న చందంగా తెలంగాణ రాష్ట్రంలో పార్టీ వెనుకబాటుకు ఢిల్లీ పెద్దలే కారణమని బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాన పార్టీల నుంచి వలసలు మొదలై, రాష్ట్రంలో ప్రత్యామ్నాయశక్తిగా దూకుడుగా ముందుకు సాగుతున్న సమయంలో ముందరి కాళ్లకు బంధనాలు వేసినట్లు పార్టీ అధ్యక్షుడిని మార్చడం ద్వారా అధిష్టానం తప్పటడుగులు వేసినట్లయింది. అయినా అసెంబ్లీ.. లోక్ సభ. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చక్కటి ఫలితాలే వచ్చాయి.

తెలంగాణలో పార్టీ అభివృద్ధి విషయంలో నాన్చివేత ధోరణి అవలంభించడం.. రాష్ట్రానికి నిధుల విడుదలలో వివక్ష చూపడం.. వలస.. ఆర్ఎస్ఎస్ (RSS) భావజాలం గలిగిన నేతల మధ్య వర్గ పోరు వంటి చర్యల ఫలితంగా పార్టీ తిరోగమనం పాలైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు… అధిష్టాన పెద్దల అనాలోచిత నిర్ణయాలు.. పార్టీ ముఖ్య నేతల మధ్య కొరవడిన సమన్వయం పార్టీ అభ్యున్నతికి శాపంగా మారాయని వారు పేర్కొంటున్నారు.

TG Bjp| ఆంధ్రప్రభ పొలిటికల్ బ్యూరో, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్న దశ నుంచి శ్ కమలం పార్టీ ఒక్కసారిగా చతికిల పడినట్లు కనిపిస్తోంది. ఉవ్వెత్తున ఉత్సాహం ఉరకలేస్తున్న వేళ, ఆ వేగానికి కళ్లెం వేసింది బీజేపీ పెద్దలేనని పార్టీ వర్గాలు సైతం వాపోతున్నాయి. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) తెలంగాణ ఎంపీలతో సమీక్ష నిర్వహించిన సందర్భాన్ని పురస్కరించుకొని, తెలంగాణాలో పార్టీ వికాసానికి ఇకనైనా అడుగులు పడాలని పార్టీ కేడర్ కోరుతోంది. గత వైఫల్యాలను సరిదిద్దుకొని మరింత ఉత్సాహంతో ముందుకు సాగేందుకు ప్రధాని చేసిన సమీక్ష ఉపయోగపడుతుందన్న ఆశాభావంతో పార్టీ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఈ క్రమంలో గతంలో జరిగిన పొరపాట్లు, పార్టీ పరంగా చేయాల్సిన దిద్దుబాటు చర్యలపై రాజకీయాలకు అతీతంగా చర్చ జరుగుతోంది.

Review

TG Bjp | సబ్ కా సాత్ – సబ్ కా వికాస్

మాటలకే పరిమితం కేంద్రంలోని బీజేపీ అధిష్టానం పదే పదే వల్లించే సబ్ కా సాత్ – సబ్ కా వికాస్ అనే పదాలు మాటలకే పరిమితమ య్యాయని సామాజికవేత్తలు పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం (Central Govt) నుండి తెలంగాణ రాష్ట్రానికి అందాల్సిన సహ కారం పూర్తిస్థాయిలో అందడం లేదని వారు గుర్తు చేసు న్నారు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో పాటు, బీజేపీ పాలిత రాష్ట్రాలకు అందిస్తున్న సహకారంతో పోలిస్తే, తెలంగాణకు మొండిచేయి చూపుతున్నారన్న అభిప్రాయం వారి నుంచి వినిపిస్తోంది.

Review

బీజేపీ ఎంపీలను గెలిపిస్తే, ఢిల్లీ (Delhi) పెద్దల తీరు మారుతుందన్న ఆశతో ఎనిమిది లోక్సభ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించినా, గడిచిన 18నెలలుగా మళ్లీ అదే కథ పునరావృతమవుతోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో చెల్లిస్తున్న నిధుల్లో, సగం నిధులు కూడా రాష్ట్రానికి రావడం లేదన్న ఆవేదన ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. కేంద్రం తెలంగాణ కోసం ఇచ్చిన ఎక్స్ క్లూజీవ్ ప్రాజెక్ట్లు గాని, జాతీయస్థాయి పథకం కానీ ఒక్కటి కూడా కేటాయించక పోవడం పట్ల వారు ఆందోళన చెందుతున్నారు.

ఇదే విషయమై పదేపదే ప్రస్తావిస్తూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు (Congress Party) బీజేపీని జనం ముందు దోషిగా నిలబెడుతున్నా, కౌంటర్ కూ డా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతోందంటూ కాషాయ పార్టీ కార్యకర్తలు వాపోతున్నారు. తెలంగాణ ప్రజల మనస్సుల్లో నూ తమ రాష్ట్రంపై బీజేపీ వివక్ష చూపుతోందన్న భావన బలంగా ఉందని పార్టీ కేడర్ అంగీకరిస్తోంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో కొద్దో గొప్పో పనులు చేసినా, పార్టీలో నెలకొన్న గ్రూపు రాజకీయాల కారణంగా ప్రజలకు చెప్పుకో లేక పోతున్నట్లు వారు వాపోతున్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) కోరుకున్న విజయం దక్కాలంటే, నేరుగా అధిష్టానమే రంగంలోకి దిగాలని పార్టీ కేడర్ వేడుకుంటోంది. తెలంగాణలో బీజేపీ భవితవ్యంపై మోడీ ప్రకటనతో ఆశలు చిగురిస్తున్నా, పార్టీ పెద్దలు దృష్టిసారిం చకపోతే, మార్పు రావడం కష్టమన్న భావన కార్యకర్తల నుంచి వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు చరిత్రలో ఒక్కసారి కూడా అధికారం రుచిచూడలేదని, పార్టీ పటిష్టతకు కేంద్ర పెద్దలు ముందడుగు వేస్తే, తాము తమ సత్తా చాటుతామని పార్టీ కార్యకర్తలు పేర్కొంటున్నారు.

Review

TG Bjp | భద్రాద్రి రామయ్యపై వివక్ష..

పదేపదే రామనామం జపిస్తూ, రామ జన్మభూమి, అయోధ్యలో (Ayodhya) ఆలయ నిర్మాణం అంటూ అధికారం చేపట్టిన బీజేపీ, రామాయణ కాలంలో అయోధ్య తర్వాత అంతకంటే ఘనచరిత్ర, వైభవం కలిగిన దక్షిణ అయోధ్య భద్రాచలంపై శీతకన్ను వేసిందని రామభక్తులు ఆరోపిస్తున్నారు. భద్రాద్రి రాములోరి భక్తుల మనోభావాలను ఆ పార్టీ పెద్దలు పట్టించుకోవడం లేదని, వంద రూపాయలు కూడా భద్రాచలం అభివృద్ధికి కేటాయించలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని పూర్తిచేయగా అయోధ్య కళకళలాడుతోంది. రామ జన్మభూమి, రథయాత్ర, అయోధ్యలో ఆలయ నిర్మాణం వంటి రాజకీయ ప్రాధాన్యత గలిగిన సున్నిత అంశాలను చాకచక్యంగా పరిష్కరించిన బీజేపీ (Bjp) పాలకులు, సీతా లక్ష్మణ సమేతుడై రాముడు నడయాడిన ప్రాంతాన్ని మాత్రం విస్మరించిన కారణంగా కంచర్ల గోపన్న, రామదాసుగా మారి కట్టించిన భద్రాచల శ్రీసీతా రామచంద్రస్వామి వారి దేవాలయం వెలవెలబోతోంది.

కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వదేశ్ దర్శన్ పథకంలో రామాయణ సర్క్యూట్ అమలుకు ప్రణాళికలు రూపొందించినా, ఆ దిశగా అడుగులు పడలేదని పలువురు ఆరోపిస్తున్నారు. రామాయణంతో (Ramayana) సంబంధం ఉన్న ప్రాంతాలను జాతీయ, అంతర్జాతీయ పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలన్న బీజేపీ ప్రభుత్వ ప్రకటన పేపర్ల వరకే పరిమితమైందని, ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించడం, స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించడం, ఆదాయాన్ని పెంపొం దించడంతో పాటు మౌలిక వసతుల అభివృద్ధి చేపట్టేలా లక్ష్యాలను నిర్దేశించించుకున్నప్పటికీ, ఈ పథకం అమలుకు నోచుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

TG Bjp
TG Bjp

శ్రీరాముని జీవితం, వనవాసం, యుద్ధం, పట్టాభిషేకం వంటి ఘటనలకు సంబంధించిన ప్రాంతాలను రామాయణ్ సర్క్యూట్గా అభివృద్ధి చేయాలని కేంద్రం భావించినా, కనీసం ఒక్క రూపాయి కూడా భద్రాద్రి భవితవ్యం కోసం కేటాయించని తీరు ఈ ప్రాంత ప్రజలతో పాటు, రామభక్తుల ఆగ్రహానికి కారణమవుతోంది. భద్రాచలం వరకు రైల్వేలైన్ (Railway Line) నిర్మాణం, ఆలయ అభివృద్ధి, ఆలయ సుందరీకరణ, రహదారులు, పార్కింగ్, పాదచారుల మార్గాలతో పాటు లైటింగ్, ఘాట్లు, ఘాట్ హారతులు, మ్యూజియం, ఇంటర్ ప్రిటేషన్ సెంటర్ ఏర్పాటు, డిజిటల్ గైడ్స్, సౌండ్ అండ్ లైట్ షోలను ఏర్పాటు చేయాల్సి ఉందని, ఒక్కో ప్రాజెక్టుకు వంద కోట్లకు పైగా వెచ్చించాలని నిర్ణయించినా, ఇప్పటి వరకు ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు కూడా రూపొందించకపోవడం పట్ల ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు.

TG Bjp | దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిందే.?

అన్ని రాష్ట్రాలతో సమానంగా తెలంగాణాలోనూ పార్టీ విస్తరణ, నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని బీజేపీ శ్రేణులు కోరుతున్నాయి. తెలంగాణపై వివక్ష చూపడం మాని, కేంద్రం నుంచి కేటాయించాల్సిన నిధుల విషయాన్ని పున సమీక్ష చేయాలని వారు కోరుతున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్రం తీరు మారాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వారు పేర్కొంటున్నారు. గతంలో బీఆర్ఎస్ ఏలుబడిలో నిధులు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నప్పటికీ, నాటి సీఎం కేసీఆర్ (KCR) కలిసి రాలేదని పార్టీ ముఖ్యనేతలు ఆరోపించారని, ప్రస్తుతం నిధులు కేటాయిం చాలని కోరుతూ రాజకీయాలకతీతంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు, ప్రస్తుత మంత్రులందరూ చెప్పులరిగేలా ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా, ఎందుకు కనికరించడం లేదని సొంత పార్టీ శ్రేణుల నుంచే వినిపిస్తోంది.

బీహార్ తో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాలకే కేంద్రం పెద్దపీట వేస్తోందని, సబ్ కా వికాస్ జరగాలంటే తెలంగాణకు కూడా నిధులు ఇవ్వాలని వారు కోరుతున్నారు. అయోధ్యలో ఉన్నది మాత్రమే రాముడు కాదని, భద్రా చలం రాముడి విషయం మీద కూడా ఫోకస్ చేయాలని, త ద్వారా తెలంగాణాలోనూ పార్టీ (Telangana) బలోపేత మయ్యే అవకాశాలు మెరుగుపడతాయని వారు సూచిస్తు న్నారు. ప్రత్యేక పరిశీలకులను ఏర్పాటు చేసి, గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టాలని, సాధ్యమైనన్ని నిధులను ఇతర రాష్ట్రాలకు దీటుగా ఇవ్వాలని, తెలంగాణ ప్రజలతో పాటు ఉత్తర భారతదేశ ప్రజల ఆరాధ్యదైవమైన భద్రాద్రి ఆలయ అభివృద్ధికి సహకారం అందించాలని వారు కోరుతున్నారు. మరి బీజేపీ అధిష్టానం ఆ దిశగా అడుగులు వేస్తుందో లేదో వేచిచూద్దాం.

TG Bjp
TG Bjp

TG Bjp| అసలు ముద్దాయి అధిష్టానమే

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వెనుకబాటుకు పార్టీ అధిష్టానమే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజల మద్దతుతో వేగంగా దూసుకుపోతున్న సమయంలో కొందరి మాటల ప్రభావంతో ఢిల్లీలోని అగ్ర నాయకత్వమే బ్రేకులు వేసిందని పార్టీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలం గల బండి సంజయ్ (Bandi Sanjay) సారథ్యంలో అసెంబ్లీ ఎన్నికలను దీటుగా ఎదుర్కొంటామని భావించినప్పటికీ, ఆయనను మార్పుచేయడం పార్టీలో ఉత్సాహాన్ని నీరుగార్చిందని వారు గుర్తు చేస్తున్నారు.

అయినప్పటికీ అసెంబ్లీ, లోక్సభ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో చక్కటి ఫలితాలను సాధించామని, ఆ విజయాల పరంపరను కొనసాగించే అవకాశం లేకుండా పార్టీ పెద్దలే అడ్డుకున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఎన్నికల (Election) అనంతరం నూతన నాయ కత్వాన్ని ఎంపిక చేసే విషయంలోనూ విపరీతమైన సాగదీత ధోరణితో ముందుకు సాగి, పార్టీ అభ్యున్నతిని అలక్ష్యం చేశారని పార్టీ శ్రేణులు వాపోతున్నారు.

మరోవైపు కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి విడుదల చేయాల్సిన నిధుల విషయంలోనూ బీజేపీ (Bjp) అధిష్టానం, పాలకులు వివక్ష చూపుతున్నట్లు ప్రజలు, ప్రతిపక్షాల నేతలు ఆరోపిస్తున్నప్పటికీ, వారి ఆరోపణలను ధీటుగా ఎదుర్కొని, సమాధానం చెప్పే నాయకుడే తమ పార్టీలో లేకుండా పోయారని బీజేపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి.

TG Bjp
TG Bjp

తెలంగాణ (Telangana) పట్ల సవతి తల్లి ప్రేమ చూపుతూ, ప్రజలు అండగా నిలవ లేదని బాధ పడటం బీజేపీ పెద్దలకు సమంజసం కాదని వారు గుర్తు చేస్తున్నారు. మరోవైపు పార్టీ అభ్యున్నతిపై ఫోకస్ చేసి, పార్టీని సంస్థాగతంగా అభివృద్ధి చేయడంలోనూ అధిష్టానం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న ఆందోళన వారి నుంచి వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి గత 11ఏళ్లుగా నిధుల మంజూరు విషయంలో నిర్లక్ష్యం తారాస్థాయికి చేరుకుందని, గత బీఆర్ఎస్, నేటి కాంగ్రెస్ పాలకులు కూడా పదేపదే ఇదే విషయమై బీజేపీని విమర్శిస్తున్నారని, కేంద్రం తీరును నిలదీస్తున్నారని వారు గుర్తు చేస్తున్నారు.

అంతే కాకుండా వలసలతో వచ్చిన ఊపును కాపాడుకోలేక పోయామని, వలస నేతలకు అవకాశం ఇవ్వక, ఉన్న నేతలను ఉపయోగించుకోలేక పార్టీ వెను కబడిందన్న భావన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్ర బీజేపీలో (State Bjp) పెరిగిన గ్రూపు తగాదాలను పరిష్కరించడంతో పాటు, సమన్వయ పరచ డంలోనూ పార్టీ పెద్దలు విఫలమైనట్లు వారు ఆరోపిస్తున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో నాయకులు పది వర్గాలు, 33 గ్రూపులుగా మారారని పార్టీ శ్రేణులు ఆవేదన చెందుతున్నాయి.

click here to read | Delhi | సోనియా, రాహుల్‌గాంధీకి ఊరట

click here for more

Leave a Reply