35th Division | డ్రైనేజీ పనులు పరిశీలించిన మంత్రి కొండ సురేఖ

35th Division | డ్రైనేజీ పనులు పరిశీలించిన మంత్రి కొండ సురేఖ
- త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు
35th Division | కరీమాబాద్, ఆంధ్రప్రభ : నగరంలోని శివనగర్ అండర్ డ్రైనేజీ పనులను రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) మురళీధర్ రావు పరిశీలించారు. అండర్ డ్రైనేజీ పనుల జాప్యం పై 35వ డివిజన్(35th Division కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ కుమార్ మంత్రి కొండ సురేఖకు విజ్ఞప్తి చేయగా స్పందించిన మంత్రి మంగళవారం శివనగర్ అండర్ డ్రైనేజీ పనులను మేయర్ గుండు సుధారాణి, నగరపాలక సంస్థ కమిషనర్ చాహేత్ బాజ్పాయ్, ఈ ఈ సంతోష్ తో కలిసి పనులను పరిశీలించారు.
జాప్యానికి కారణం ఏమిటి అని మంత్రి కమిషనర్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పనుల జాప్యం వల్ల రైల్వే స్టేషన్(Railway Station) బస్ స్టాండ్ వరంగల్ సిటీకి వెళ్లాల్సినవారు చుట్టు తిరగాల్సి వస్తుందని ఫలితంగా వాళ్ల సమయం వృధా అవుతుందని మంత్ర దృష్టికి తీసుకొని రాగా స్పందించిన మంత్రి పనులను వెంటనే పూర్తిచేయాలని కమిషనర్(Commissioner ను ఆదేశించారు.
కార్యక్రమంలో ఈఈ సంతోష్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోపాల్ నవీన్ రాజ్, పిసిసి కార్యదర్శి కొత్తపెళ్లి శ్రీనివాస్ మీసాల ప్రకాష్,శ్రీరామ్ రాజేష్, ఎండి అఫ్జల్, పోలబోయిన చిన్న పటేల్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
