KDCC Chairman | ప్రజల వద్దకు పాలన తెచ్చింది టీడీపీ నే..

KDCC Chairman | ప్రజల వద్దకు పాలన తెచ్చింది టీడీపీ నే..
- సమస్యల పరిష్కార వేదిక చూపింది బాబు నే…
- నిత్యం అందుబాటులో ఉండేది కూటమి నేతలే..
- ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తున్న ప్రభుత్వం..
KDCC Chairman | విజయవాడ, ఆంధ్రప్రభ : ప్రజల వద్దకు నేరుగా పాలన తీసుకువచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుకే (Chandrababu naidu) దక్కుతుందని కేడీసీసీ చైర్మన్, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి నెట్టెం రఘురాం పేర్కొన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని అక్కడికక్కడే వాటికి పరిష్కార మార్గం చూపించేందుకు ప్రజా దర్బార్ నిర్వహించడం శుభ పరిణామమని చెప్పారు.
విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాదర్బార్ లో ఆయన ఎమ్మెల్యే సుజనా చౌదరితో (Mla Sujana Chowdary) కలిసి పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… 15 నెలల కూటమి పాలనలో ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగిందని, ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. నేరుగా ప్రజల వద్దకే ప్రజా ప్రతినిధులు, అధికారులు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారాన్ని చూపించడం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న ఆయన, సంక్షేమాన్ని కూడా సమపాళ్లలో అందిస్తూ ఉన్నామన్నారు. కూటమి నాయకులు అధికారుల సమన్వయంతో ప్రజా దర్బార్ లో ప్రజల నుండి వినతలు స్వీకరించి చక్కటి పరిష్కార మార్గాలు చూపిస్తున్నామన్నారు. ప్రజలకు ఇదొక మంచి అవకాశంగా ఉందన్నారు.
