Idupu Kayitam | టైటిల్‌పై సోషల్ మీడియాలో దుమారం..

  • దీనికీ అర్థం తెలియదా?.. సబ్‌టైటిల్స్ కావాలంటే బీహార్ వెళ్లండి’..
  • ఘంటా చక్రపాణి ఘాటు వ్యాఖ్యలు

Idupu Kayitam | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: సినిమా ఇంకా సెట్స్‌పైకి కూడా వెళ్లలేదు… కానీ టైటిల్ మాత్రం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు, చిన్నపాటి వివాదానికి దారితీసింది. ఇటీవల పూజా కార్యక్రమంతో ఘనంగా ప్రారంభమైన ‘ఇడుపు కాగితం’ చిత్రం పేరు ఇప్పుడు నెటిజన్ల మధ్య హాట్ టాపిక్‌గా మారింది.

‘ఇడుపు కాయితం’ అంటే ఏమిటి? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వెల్లువెత్తడంతో, తెలంగాణ భాషా, సంస్కృతి అంశంపై ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి స్పందించారు. తన ఎక్స్ ఖాతాలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Idupu Kayitam

“ఇన్ని సంవత్సరాలు తెలంగాణలో కలిసి ఉన్నా… ‘ఇడుపు కాయితం’ అంటే ఏమిటో ఇంకా తెలియదా? విడిపోయే సమయంలో రాసుకునే పత్రాన్నే తెలంగాణలో ‘ఇడుపు కాయితం’ అంటారు. దీనికీ సబ్‌టైటిల్స్ కావాలంటే మీరు బీహార్ వెళ్లండి” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి.

ఘంటా చక్రపాణి వ్యాఖ్యలకు తెలంగాణ మాండలికాన్ని సమర్థించే పలువురు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు మాత్రం ఒక ప్రాంతీయ పదానికి వివరణ అడగడంలో తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. దీంతో సినిమా టైటిల్ చుట్టూ భాష, మాండలికం, ప్రాంతీయ సంస్కృతిపై మరోసారి చర్చ మొదలైంది.

Idupu Kayitam

కాగా, ప్రముఖ నిర్మాత బన్నీ వాసు నిర్మాణంలో, దర్శకుడు సుకుమార్ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. హీరోగా ప్రియదర్శి, కథానాయికగా యూట్యూబ్‌లో తన పాటలు, నృత్యాలతో గుర్తింపు పొందిన నాగదుర్గ నటిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన పూజా కార్యక్రమంతో ఈ సినిమా అధికారికంగా ప్రారంభమైంది.

టైటిల్ చుట్టూ మొదలైన ఈ చర్చ… సినిమా విడుదల నాటికి మరింత ముదురుతుందా? లేక ఇదంతా చిత్రానికి అదనపు ప్రచారంగా మారుతుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరిన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకోవడానికి ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి.