Selfie | సూసైడ్ వీడియో కలకలం…

Selfie | సూసైడ్ వీడియో కలకలం…

Selfie | భద్రాచలం, ఆంధ్రప్రభ : భద్రాచలంలో ఓ దళిత మహిళ నాయకురాలు ఒక సూసైడ్ సెల్ఫీ వీడియో విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. ఒక సెటిల్మెంట్ కారణంగా ఏర్పడిన విషయంతో దళిత సంఘాలు కొందరు తనను వేధిస్తున్నారు అంటూ మహిళా నాయకురాలు మేకల లత సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసింది. తోటి మహిళకు న్యాయం చేయాలని ప్రయత్నం చేస్తున్న తనను మరో మహిళ నాయకురాలు వేధిస్తున్నారని వీడియోలో చెప్పారు. తను చనిపోయేందుకు కారణం అవుతున్న వారిని వదిలిపెట్టొద్దని చర్యలు తీసుకోవాలంటు ఆ వీడియోలో పోలిసులకు విజ్ఞప్తి చేశారు. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మేకల లతని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. జరిగిన సంఘటన పై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని భద్రాచలం పట్టణం సీఐ నాగరాజు తెలిపారు.

Leave a Reply