Prathap Reddy | ఆదరించి… అవకాశం ఇవ్వండి
- ఆదర్శ పంచాయతీగా దాదన్ పల్లి
- సర్పంచ్ అభ్యర్థి ప్రతాప్ రెడ్డి
Prathap Reddy | మక్తల్, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఆదరించి అవకాశం కల్పించండి… దాదనపల్లి గ్రామాన్ని మండలంలో ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దుతామని బీజేపీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జి.ప్రతాపరెడ్డి అన్నారు. ఇవాళ ఆయన తన మద్దతుదారులతో గ్రామంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఇంటింటికి వెళ్లి గ్రామ సమస్యలను వివరిస్తూ సమస్యల పరిష్కారం కావాలంటే సర్పంచ్ గా తనను గెలిపించవలసిందిగా అభ్యర్థించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గ్రామాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడమే తన ధ్యేయమన్నారు. రాజకీయాలకు అతీతంగా పంచాయతీ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వవలసిందిగా ఆయన అభ్యర్థించారు. గ్రామంలో డ్రైనేజీలు, అంతర్గత రహదారుల నిర్మాణం చేపట్టేందుకు కృషి చేస్తానన్నారు. అదేవిధంగా ముంపు గ్రామ సమస్యలను పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు. గ్రామ అభివృద్ధి కోసం తనను ఆదరించి సర్పంచిగా గెలిపించవలసిందిగా ప్రతాపరెడ్డి గ్రామస్థులకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో
మద్దతు దారులు, నాయకులు బి .వెంకటన్న ,లింగప్ప, గంగప్ప, కురువ భీమన్న, గోకరి భీమన్న, మీదిగేరి హనుమంతు, బళ్లారి హనుమంతు, గుగ్గుళ్ల ఆంజనేయులు, బొంపల్లి అశోక్, భీమ్లమ్మ ,శంకరమ్మ, జయమ్మ, లక్ష్మి, అంజమ్మ ,మల్లమ్మతదితరులు పాల్గొన్నారు.

