CC Roads | ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా

CC Roads | ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా

  • ప్ర‌చారంలో దూసుకెళ్తున్న కాంగ్రెస్ అభ్యర్థి వాసం సుస్మిత

CC Roads | ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : మండల పరిధి రాయిగూడెం, మైలారం, సీతారాంపురం, లక్ష్మీపురం, చింతొల్లగుంపు, కొమ్ముగూడెం, పలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ(Congress party) సర్పంచి వాసం సుస్మిత విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

సర్పంచ్‌గా గెలిపిస్తే ఆళ్లపల్లి గ్రామానికి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆశీస్సులతో నిధులు తీసుకువ‌స్తాన‌ని హామీ ఇచ్చారు. మిగిలిపోయిన సీసీ రోడ్లు, డ్రైనేజీ(CC Roads, Drainage) పనులు పూర్తి చేస్తాన‌న్నారు. అర్హులైన వారికి పెన్షన్స్, ఇందిరమ్మ ఇళ్లను ఇప్పించేందుకు తాను కృషి చేస్తాన‌న్నారు. కార్యక్రమంలో వాసం శ్రీకాంత్, మహమ్మద్ అతాహర్, కొడెం సత్యం, సుమన్, నులకతాటి శ్రీను, సుధాకర్, బుర్రవెంకన్న,అజ్జు, జీవన్, కృష్ణ, రామనరసయ్య, మంగ, పద్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply