Govt | సేవే మార్గం..అభివృద్ధి లక్ష్యంగా…

Govt | సేవే మార్గం..అభివృద్ధి లక్ష్యంగా…
Govt | తాడ్వాయి, ఆంధ్రప్రభ : తాడ్వాయి పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఈర్ప సుకన్య సునీల్ దొర దంపతులు సేవే మార్గం.. అభివృద్ధి లక్ష్యంగా… ముందుకు సాగుతున్నారు. ప్రచారంలో ప్రజల మద్దతు కూడగట్టుకోని ముందుకు సాగుతున్నారు. తాడ్వాయి పంచాయతీలో అన్ని వర్గాల ప్రజలు నూటికి నూరు శాతం కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్తి ఈర్ప సుకన్య సునీల్ దొరలకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని ముందుకు వచ్చారు.
ఎక్కడికి వెళ్లిన ప్రజాదరణ పుష్కలంగా లభిస్తుంది పంచాయతీ ప్రజలు ఉవ్వెత్తిన కదిలి రావడంతో సుకన్య ప్రచారంలో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజాసేవే లక్ష్యంగా పనిచేయడానికి ముందుకు రావడం జరిగిందని పదేళ్లలో బీఆర్ ఎస్ పార్టీ ప్రభుత్వం(Govt)లో చేయలేని అభివృద్ధిని పంచాయతీలో చేసి చూపిస్తానని ఆమె అన్నారు.
కుల మతాలకు అతీతంగా అభివృద్ధికి బాటలు వేస్తానని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టి ప్రతి సంక్షేమ పథకం పంచాయతీ ప్రజలకు అందే విధంగా సీతక్క సహకారం తో తమ వంతు అభివృద్ధి కి కృషి చేస్తానని అన్నారు. ఏ వాడ కెళ్ళిన ప్రజల్లో చక్కటి స్పందన లభిస్తుందని తమకెంతో ఆనందంగా ఉందని అన్నారు. జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్న తమకు మై అమూల్యమైన రింగ్ గుర్తు కు ఓటు వేసి అత్యధిక మెజార్టీ(overwhelming majority)తో గెలిపించాలని కోరారు.
నాకు ఓటు వేయండి అభివృద్ధిని ఆశించండి ప్రజాక్షేత్రంలో ఉండి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అంటూ విస్తృతంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలం అధ్యక్షులు బొల్లు దేవేందర్ ముదిరాజ్,ములుగు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగా కళ్యాణి,మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అరేం లచ్చు పటేల్,మండలం వర్కింగ్ ప్రసిడెంట్ ముద్రకొల్ల తిరుపతి పాక సాంబయ్య,సిద్దిరెడ్డి,బొల్లు నాగేంద్ర, రమేష్ పిట్టల సారయ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
