Rs. 40 lakhs | మరోసారి ఆదరిస్తే..

Rs. 40 lakhs | మరోసారి ఆదరిస్తే..
- మరింత అభివృద్ధి చేస్తా..
- కాచాపూర్ లో మారుపాక శ్రీలత కుమారస్వామి
Rs. 40 lakhs | జూలపల్లి, ఆంధ్రప్రభ : మరోసారి గ్రామ ప్రజలు ఆదరించి గెలిపిస్తే.. గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని కాచాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి మారుపాక శ్రీలత కుమారస్వామి కోరుతున్నారు. గతంలో ఎంపీటీసీగా పని చేసి ప్రజా సమస్యల పరిష్కారం(solution)తోపాటు గ్రామాభివృద్ధి కోసం తనవంతుగా కృషి చేసినట్లు ప్రజలకు వివరిస్తున్నారు.
మీ ఆశీస్సులతో మరోసారి మీ ముందుకు సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నానని, ఫుట్ బాల్ గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే ప్రజా సేవకులుగా ఉంటామని హామీ ఇస్తున్నారు.
కాచాపూర్ గ్రామంలో వాడవాడలా పర్యటిస్తూ.. ఇంటింటికి తిరుగుతూ జోరుగా ప్రచారం చేయడంతో ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. రానున్న ఎన్నికల్లో అండగా ఉంటామని ప్రజలు మారుపాక శ్రీలత కుమారస్వామికి మద్దతుగా నిలుస్తున్నారు. గతంలో మన ఊరు-మన బడి ద్వారా రూ.40లక్షలు(Rs. 40 lakhs) మంజూరు చేయించి పాఠశాలను అభివృద్ధి చేసినట్లు తెలిపారు.
వాడవాడలా సీసీ రోడ్లు వేయించామని, డ్రైనేజీలు నిర్మించామని వివరించారు. మరుగుదొడ్లు నిర్మించామని, ఇంకుడుగుంతలు నిర్మించామని తెలిపారు. మరోసారి ఆదరించి గెలిపిస్తే కొత్త అంగన్వాడీలు మంజూరు చేయిస్తామని, కుల సంఘ భవనాలు నిర్మిస్తామని, మరిన్ని సీసీ రోడ్లు(CC roads), డ్రైనేజీలు నిర్మిస్తామని హామీ ఇస్తున్నారు.
ఇచ్చిన హామీలను ఐదేళ్లలో పూర్తి చేయిస్తామని, ఫుట్బాల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు. ప్రజల అండతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
